డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ చేతులెత్తేశాడు.కొవిడ్-19 వైరస్ నివారన పేరుతొ జపాన్ దేశం విహారనౌకలో నిర్బంధించిన 138 మంది భారతీయులను బయటకు తీసుకురాలేమని కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు. కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్ ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించిందని, ఈ నౌకలో 3,711 మంది ఉన్నారని, వారిలో 138 మంది భారతీయులని మంత్రి చెప్పారు. కాగా మంత్రి వ్యాఖ్యలతో నౌకలో ఉన్న భారతీయుల కుటుంబాల్లో ఆందోళన నెలకుంది.