37.7 C
Hyderabad
May 4, 2024 15: 02 PM
Slider ఖమ్మం

డోర్ టూ డోర్ సర్వే వెంటనే పూర్తి చేయాలి

#Gautam

ఎలక్టోరోల్‌ సంబంధ డోర్‌ టు డోర్‌ సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. ఐడిఓసి సమావేశం మందిరంలో ఆర్‌.ఓ.లు, తహసీల్దార్లతో సర్వే ప్రక్రియపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సర్వే ప్రక్రియ లో పురోగతి, ఫారం-6,7,8 ల పరిష్కారం పై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డోర్‌ టు డోర్‌ సర్వే వేగంగా జరుగుతున్నట్లు, నిర్ధారిత లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బూత్‌ లెవల్‌ అధికారులు డోర్‌ టు డోర్‌ సర్వే లో చేపట్టాల్సిన అంశాలపై పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. ఇంట్లో ఓటు హక్కు కు అర్హత ఉండి, ఓటు హక్కు లేని వారిని గుర్తించి ఫారం-6 సేకరించాలన్నారు.

షిఫ్టెడ్‌, మరణించిన ఓటరు వివరాలు సేకరించాలన్నారు. దివ్యాంగులు, 80 సంవత్సరాల పై వయస్సు వారిని గుర్తించి, మార్క్‌ చేయాలన్నారు. ప్రతి ఇంటి నుండి మొబైల్‌ నెంబర్‌ సేకరించాలన్నారు. పెండిరగ్‌ ఫారం 6, 7, 8 లపై పరిశీలన పూర్తి చేసి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

ఈ కార్యక్రమం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సూరబి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, డి అర్‌ ఓ శిరీష,కల్లూరు అర్‌ డి ఓ సూర్యనారాయణ, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ దశరత్‌, తహసీల్దార్లు కలెక్టరేట్‌ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

క‌రోనా మహమ్మారి కాలంలో నిశ్బబ్ద భాదితులు దివ్యాంగులే

Sub Editor

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

Sub Editor

55 రాజ్యసభ ఖాళీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

Satyam NEWS

Leave a Comment