39.2 C
Hyderabad
May 4, 2024 19: 13 PM
Slider ఆదిలాబాద్

సిర్పూర్ కాగజ్ నగర్ లో బిజెపి ప్రతిష్టను మరింత పెంచుతా

#Dr.Kottapally

వెనుకబడిన ప్రాంతాలకు చెందిన నాయకులకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పెద్దపీట వేస్తున్నారు.

ఇందులో భాగంగా కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు.

ఈ విధంగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ను నియమించడం ఇది రెండో సారి.

తనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పని చేస్తానని డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు.

సేవా భావంతో, అంకితభావంతో కృషి చేసి పార్టీ పేద ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటూ ప్రతి ఒక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం

Satyam NEWS

పలుకవా శ్రీవాణీ నీకు ట్రస్టు ఎందుకు పెట్టారు?

Satyam NEWS

ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

Bhavani

Leave a Comment