37.2 C
Hyderabad
April 30, 2024 14: 14 PM
Slider ముఖ్యంశాలు

నిమ్మగడ్డ మరో ఆదేశాన్ని తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం

#GunturCollector

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలను అనుక్షణం సవాల్ చేస్తూనే ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఆదేశాలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ ను నియమించింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి గుంటూరు జిల్లా కలెక్టర్ గా వివేక్ యాదవ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించగా ఆయన నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తిరస్కరించిన పేరునే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ గా నియమించి మరో సవాల్ ను విసిరింది.

గుంటూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించి ఎన్నికలను సజావుగా నిర్వహించేంత అనుభవం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఆయన రాతపూర్వక ఆదేశాలను జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన ఆదేశాలను ఖాతరు చేయలేదు.

ఎన్నికల కమిషనర్ సిఫార్సు చేసిన రెండు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు.

నేడు బాధ్యతలు తీసుకున్న కొత్త కలెక్టర్ కు జేసీలు దినేశ్ కుమార్, ప్రశాంతి, జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు.

గుంటూరు జిల్లాలో స్థానిక ఎన్నికలు సాఫీగా సాగేలా కృషి చేస్తానని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎన్నికలు విజయవంతం చేస్తానని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.

Related posts

తల్లిదండ్రుల గురువుల ఆశయాన్ని నిలబెట్టే బాధ్యత మీదే

Satyam NEWS

పెండింగ్ చాలానాలపై గద్వాలలో స్పెషల్ డ్రైవ్

Bhavani

రైల్లోంచి దూకేసిన ప్రేమజంట

Murali Krishna

Leave a Comment