39.2 C
Hyderabad
May 4, 2024 21: 07 PM
Slider విజయనగరం

హిజ్రా లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కు కృషి

హిజ్రాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం లిఫ్టింగ్ హాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో ని కలెక్టరేట్ సమీపంలో కామాక్షి నగర్ లో ఉన్న కాపు సంక్షేమ భవనంలో “పుట్టింటి సారె సమర్పణ” కార్యక్రమంలో ఆయన ల్గొన్నారు. జీసస్ క్రీష్ట్ బ్లెస్సింగ్స్ మినిస్ట్రీస్ ప్రతినిధులు నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు హిజ్రాలకు సారె సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ ఏ వర్గమైనా సమాజంలో మంచి కార్యక్రమాలు చేపడితే ప్రజా మన్ననలు ఉంటాయన్నారు.

ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్దకు రావచ్చని చెప్పారు. నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల రిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. 2019లో ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత లిఫ్టింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ కోరిక మేరకు దుర్గామాత ఆలయ నిర్మాణానికి సహకరించామన్నారు. సమాజంలో హిజ్రాలు మంచి కోరే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుంటానన్నారు. అసోసియేషన్ వినతి మేరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు విషయమై సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు పరీక్షలు

Bhavani

రోగ్స్:పెళ్లైన తెల్లవారే వధువుపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

ఉపాధ్యాయ జీవితం ఉన్నతమైనది

Satyam NEWS

Leave a Comment