33.2 C
Hyderabad
May 4, 2024 00: 54 AM
Slider ఖమ్మం

నేరస్థులకు శిక్షపడే విధంగా కృషి చేయాలి

#spktdm

పెండింగ్ ట్రయల్ కేసులలో నేరస్థులకు త్వరితగతిన శిక్షపడే విధంగా చర్యలు తీసుకునేలా “డిస్ట్రిక్ట్ లెవెల్ పెండింగ్ ట్రయల్ మానిటరింగ్ కమిటీ”ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో చైర్మన్ గా జిల్లా ఎస్పీ,వైస్ చైర్మన్ గా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్,కన్వీనర్ గా డీసీఆర్బీ డిఎస్పీ మరియు సభ్యులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,పోలీసు అధికారులు ఉంటారు. కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఎ ఫంక్షన్ హాలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,జిల్లా పోలీసు అధికారులు,కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లతో జిల్లా ఎస్పీ డా.వినీత్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా డిసిఆర్బి డీఎస్పీ నందిరాం ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను,ఇప్పటివరకు కన్విక్షన్ సాధించిన కేసుల వివరాలను తెలియజేసారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేసేందుకే కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పోలీస్ అధికారులు నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ,ఉన్నతాధికారుల సలహాలు,సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం పలు కేసులలో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కృష్ణ మోహన్, పీపీలు పోసాని రాధా కృష్ణమూర్తి, కె.రామారావు, హైమావతి, కొత్తా వెంకటేశ్వర్లు,మహిధర్ రెడ్డి,పీవీడి లక్ష్మి,మీరజ్ పిరదోజ్,ఏపీపీలు రచిత,దుర్గాబాయి,శ్రీనివాస్,లావణ్య,ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,డిఎస్పీలు నందీరామ్, రెహమాన్, వెంకటేష్, రమణమూర్తి, రాఘవేంద్రరావ, సిఐలు,ఎస్సైలు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

Related posts

రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదు

Bhavani

అచ్చమైన పల్లె సంక్రాంతి

Satyam NEWS

కార్తీక పౌర్ణమి సందర్భంగా అయోధ్యుకు లక్షల్లో భక్తులు

Satyam NEWS

Leave a Comment