Slider జాతీయం ముఖ్యంశాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా అయోధ్యుకు లక్షల్లో భక్తులు

ayodhya

కార్తీకపౌర్ణమి సందర్భంగా సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అయోధ్యకు లక్షల సంఖ్యల్లో చేరుకున్నారు. అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదం కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అతిపెద్ద వేడుక ఇదే కావడం విశేషం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. దర్శనం కూడా సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయోధ్యకు వస్తున్న భక్తుల సౌకర్యార్థం కోసం హెల్త్ సెంటర్లు, తాగునీటి సదుపాయం అక్కడక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. 18 స్థలాల్లో వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండగా 20 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 30 మొబైల్ టాయ్‌లెట్లు కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Related posts

కలెక్టరేట్ “స్పందన”కు…బాధితుల మాదిరిగానే “టీడీపీ”

Satyam NEWS

Can Hemp Flower Cbd Make You Fail A Drug Test

mamatha

తెనాలి ఫ్లైఓవర్ పై మందుబాబుల ఆగడాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!