41.2 C
Hyderabad
May 4, 2024 16: 18 PM
Slider నల్గొండ

చేనేత వస్త్రాలను ఆదరిద్దాం,నేతన్నల జీవితాల్లో వెలుగును నింపుదాం

Collage Maker-31-Jul-2022-11.17-PM

తమ ఒంట్లోని నరాలన్ని దారాలుగా పొగుచేసి చెమటను రంగులుగా అద్ది వస్త్రంగా మలిచే చేనేత కళాకారులకు, ఆధారిత కార్మికులకు ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు జాతీయ చేనేత  దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ ప్రతి మనిషికీ కూడుతో పాటు గుడ్డ కూడా ప్రాధమిక అవసరమని, మన దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి అవకాశాలు చేనేత రంగంలోనే ఉన్నాయని,కానీ మరమగ్గాల ధాటికి చేనేత మగ్గాలు కుదేలైపోయిందని, చేనేత రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి రోజు రోజుకీ దుర్భరంగా మారుతోందని,చేనేత రంగాన్ని,నేతన్నలను ఆదుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రఘు తెలిపారు.

భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి,స్వతంత్య్ర పోరాటంలో ముఖ్య సాధనంగా నిలిచింది చేనేత రంగమని,అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ భారత చేనేత లోగోను ఆవిష్కరించడమే కాకుండా ఆగస్టు 7వ,తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు రఘు వివరించారు.

హుజూర్ నగర్ సత్యం న్యూస్

Related posts

[Best] Dr. Weil Lower Blood Pressure Mezcal To Lower Blood Pressure Can Curcumin Lower Blood Pressure

Bhavani

వనపర్తిలో ఘనంగా వాసవిమాత ఆత్మార్పణ వేడుకలు

Satyam NEWS

సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకున్న విజయనగరం మ‌త్స్య ప్ర‌ద‌ర్శ‌న‌

Satyam NEWS

Leave a Comment