40.2 C
Hyderabad
May 2, 2024 17: 21 PM
Slider ముఖ్యంశాలు

బీజేపీ లోపాల పాలన వల్లే పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు

#cituvijayanagaram

బీజేపీ పాలన వల్లనే పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని సీపీఐ ఆరోపించింది. ఈ మేరకు సీఐటీయూ విజయనగర కమిటీ అధ్యక్షులు బి.రమణ, ఆధ్వర్యం  లో సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా నేతలు పోస్టర్ విడుదల చేసిన అనంతరం సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ! దేశ స్వతంత్రం కోసం, స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులు 3 లక్షల 50 వేల మంది పైగా ప్రాణాలు కోల్పోయారని, మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ పుచ్చలపల్లి సుందరయ్య జ్యోతిబసు నంబూద్రి ప్రసాద్ వంటి ఎంతోమంది దేశం కోసం దేశ స్వతంత్రం కోసం పోరాటాలు చేసారని సంపూర్ణ స్వాతత్ర్యం నినాదమిచ్చింది కమ్యూనిస్టు పార్టి అని శంకరరావు ఆన్నారు.

స్వతంత్ర పోరాటంలో కనీసం పాల్గొని ఆర్ఎస్ఎస్ బిజెపి వంటివి ఈరోజు దేశభక్తి ముసుగులో అధికారం వ్యామోహంతో రాజకీయం చేస్తుందని అన్నారు.ఆర్ఎస్ఎస్ నేత సావర్కర్ బ్రిటీష్ వారి కీ క్షమాపణ చెప్పి జైలునుంచి విడుదలైన దేశ ద్రోహి అని.. గాంధీని చంపిన గాడ్సే వారసులు బిజెపి అని ఆన్నారు.

2002వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ జెండా ని అంగీకరించని ఆర్ఎస్ఎస్ ఈ రోజు దేశబక్తి గురించి మాట్లాడటం దురదృష్ట కరం అని అన్నారు..నేడు బీజేపీ ప్రభుత్వంవలనే పెట్రోలు డీజిల్ గ్యాస్ వంటనూనె నిత్యవసర వస్తువులు ధరలు పెరిగాయని అన్నారు కార్మికులు రైతులు మహిళలు యావత్ ప్రజానీకి నష్టము కలిగించే చట్టాలు తీసుకువస్తున్నారని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తున్నారని అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలు కార్పొరేట్లు కు అమ్మేసి సామజిక న్యాయం గురించి..రాజ్యంగ హక్కులు తుంగ లొ తొక్కి ప్రజాస్వామ్యం గురించి మోడీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నరు.బీజేపీ విధానాలను త్రిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధం కావాలి అని శంకరరావు పిలుపు నిచ్చారు

ఈ సందర్భంగా సీఐటీయూ నగర్ కార్యదర్శి మాట్లాడుతూ ఈనెల  13నజరిగే ప్రదర్శన జయప్రదం చేయాలని ..15వ తేదీన జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర నాయకులు సురేష్.. త్రినాథరావులు పాల్గొన్నారు.

Related posts

మరో టెర్రరిస్టుపై చర్యలను అడ్డుకున్న చైనా

Satyam NEWS

కొల్లాపూర్ సర్కిల్ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

పంచాయితీ ఎన్నికలు: మద్యం నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూం

Satyam NEWS

Leave a Comment