27.7 C
Hyderabad
May 4, 2024 10: 44 AM
Slider వరంగల్

యాట కుమార్ బాటనే అందరూ నడవాలి

#CPM

రైతు కూలి సంఘం ఉమ్మడి జిల్లా నాయకుడు యాట కుమార్ సంతాప సభ రాయినిగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సంతాప సభకు సభా అధ్యక్షత పెగడపల్లి సర్పంచ్ బత్తుల లక్ష్మి సభ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ములుగు జిల్లా జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్ పాషా సిపిఎం జిల్లా నాయకులు ఎండి అంజద్ భాష హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాట మరణించడం శోచనీయమని అన్నారు.

యాటకుమార్ అకాల మరణం బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తీరని లోటు అని వారు అన్నారు. లోతట్టు ప్రాంతాలలో సమస్యల కోసం రైతు కూలీల కోసం రైతుల కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని ప్రజల కోసం చివరికి జైలు జీవితం కూడా గడిపారని అన్నారు. అక్రమ అరెస్టులు, కేసులు ఆయనను ఆపలేదని వారు తెలిపారు. ఉద్యమకారులను గుర్తించాల్సిన బాధ్యత తోటి ఉద్యమకారులపై ఉన్నదని ముంజల బిక్షపతి గౌడ్ అన్నారు.

ఉద్యమకారులు ఎవరు మరణించిన తప్పకుండా గుర్తింపు తీసుకువస్తామని అన్నారు. యాట కుమార్ సంతాప సభలో కళాకారులచే పాడిన పాటలు ఉద్యమకారులను కంటతడి పెట్టినాయి. ఈ సంతాప సభలో పాల్గొన్న నాయకులు రాయన గూడెం ఎంపీటీసీ సత్యనారాయణ రావు పంచోద్ కుల పల్లి సర్పంచ్ మాలోత్ రవీందర్ న్యూ డెమోక్రసీ పార్టీ ములుగు జిల్లా నాయకులు బొమ్మిడ సాంబయ్య లక్నవరం సొసైటీ అధ్యక్షులు పులిగుజ్జు వెంకన్న మాజీ రైతు కూలి సంఘ

నాయకులు బిక్కినేని రామారావు మాజీ ఎంపీటీసీ లింగంపల్లి సంపత్ రావు మహిళా నాయకురాలు రాజేశ్వర్ అక్క పారిజాతం సిపిఎం పార్టీ నాయకులు గుండెబోయిన రవి గౌడు ముసలయ్య ఆలయ ప్రచార కమిటీ కార్యదర్శి గుండమీది వెంకటేశ్వర్లు బూత్కూర్ రవి కళాకారుడు మోతే రమేష్ బొచ్చు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు

Satyam NEWS

జగజ్జనని

Satyam NEWS

విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి

Satyam NEWS

Leave a Comment