40.2 C
Hyderabad
April 29, 2024 18: 57 PM
Slider కవి ప్రపంచం

జగజ్జనని

#VVS Krishnakumari

పృధ్వి మీద వెలసిన

అన్నం పెట్టే దేవత అన్నమ్మవు

జల ప్రళయాలు రాకుండా

కాపాడే గంగానమ్మవు

సూర్య చంద్రులనే

కుడి ఎడమ కన్నులుగా

మలచుకున్న ఇరుకుళమ్మవు

భీకర వాయువుల నుండి

కాపాడే కరువలమ్మవు

ఉరుములు పిడుగుల నుండి

రక్షించే ఆకాశ దేవతయైన కొండమ్మవు

తలచిన మాత్రమే కోరిన కోర్కెలు

తీర్చే తలపులమ్మవు

పొలిమేరలను కాపాడే పోలేరమ్మవు

క్రిమి కీటకాలను  భూత ప్రేత పిశాచాలను

ఊడ్చి పారేసే శీతలాంబవు

పుట్టలోని పాముల నుండి

కాపాడే  పుట్టమ్మవు

అందరినీ పోషించే పోచమ్మవు ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ,లంకమ్మ

పంచభూతాలంతటా వ్యాపించి

అందరికీ మూలమైన ఆదిశక్తి వి నీవు

మా గ్రామాల్నీ, మమ్మల్ని  మా బిడ్డల్ని

పంటల్ని, పశువుల్నీ, చెట్టు చేమల్నీ

సల్లంగా చూడు

ప్రపంచాల్ని కబళించే అంటువ్యాదుల

నుండి మము రక్షించు

ఏటేటా నీకు బోన మిస్తా, చద్దులిస్తా

యాట నిస్తా, భక్తి తొ మొక్కుత

మా మీద దయ చూపు తల్లి

జగజ్జనని  జైమాత

పీ.వీ.యస్. కృష్ణ కుమారి, తుర్కయాంజాల్

Related posts

పీవీ ఆర్ధిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌పంచానికి దిక్సూచీ

Sub Editor

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి

Satyam NEWS

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment