28.7 C
Hyderabad
May 5, 2024 23: 07 PM
Slider నల్గొండ

కరోనా రహిత మండలంగా నిలిపిన ఫ్రెండ్లీ పోలీసు

nakrekal police

నల్లగొండ జిల్లా లోని నకెరేకల్ మండలం కరోనా రహిత మండలం గా నిలువడానికి స్థానిక పోలీసులు చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. నకెరేకల్  సిఐ బాలగోపాల్ ,ఏఎస్ఐ లు వెంకటేశం,బుచ్చి రాముల నేతృత్వం లో 30 మండి పోలీసు సిబ్బంది రాష్ట్ర లో లాక్ డౌన్ ప్రకటించిన 21 రోజుల్లో రాత్రింబవళ్లు శ్రమపడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కలిస్తున్నారు.  

మార్చ్ 23 దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం పోలీసుల శ్రమకు ఫలితమిచ్చిందని చెప్పవచ్చు. గుంపులుగా ఉన్నవారిని లైన్ లో ఉంచే ప్రయత్నం చేయడమే కాకుండా కరోనా వైరస్ ఉన్నదని అది దగ్గర దగ్గరా నిలబడితే వ్యాపిస్తుందని భౌతిక దూరం పాటించాలని వాళ్లకు వివరించి చెబుతూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.

మండలం లోని ప్రదాన రహదారి ప్రదాన కూడలిలో అతిపెద్ద కరోన రక్కసి బొమ్మను చిత్రీకరించి లాక్ డౌన్ పాటిద్దాం..పోలీసులకు సహకరిద్దమ్ అన్న నినాదం చూపరులను ఎంతో ఆకట్టుకున్నారు. ఎర్రటి ఎండ ను లెక్క చేయటం లేదు.

ఫ్రెండ్లీ పోలీసు  అన్న నినాదానికి వారు మారుపేరుగా నిలవడం మూలంగా ఇక్కడి ప్రాంతం దరిదాపుల్లోకు కరోనా మహమ్మారి తొంగి చూడటం లేదు.

Related posts

విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద కారు ప్రమాదం

Satyam NEWS

వినిత్, అబ్బాస్ “ప్రేమదేశం” డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో

Satyam NEWS

కొత్త జిల్లాల ఏర్పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా?

Satyam NEWS

Leave a Comment