27.7 C
Hyderabad
May 4, 2024 10: 50 AM
Slider మెదక్

మోడల్ గజ్వేల్: అతి సుందరం అద్భుత సౌకర్యం

gajewl visit

ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ అన్ని రంగాలలో ఈ స్థాయిలో అభివృద్ది చెందడం నిజంగా గజ్వేల్‌ ప్రజల అదృష్టమని, తమ నియోజకవర్గాల్లో ఇదే స్థాయిలో అభివృద్ది చేసుకుంటామని టూర్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌, వైకుంఠధామం, కల్పక వనం అర్భన్‌ పార్కులను మంగళవారం సాయంత్రం పరిశీలించింది.

హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఏం కేసీఆర్ పట్టణ ప్రగతిపై సమీక్షించిన అనంతరం గజ్వేల్ అభివృద్ధిని వీక్షించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా లోని కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఇటీవల నూతనంగా నియామకమైన అడిషనల్ కలెక్టర్లు సిద్ధమయ్యారు. ఈ మేరకు హరిత హారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కల పెంపకంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిభిషన్‌ను వర్గల్‌ మండలం సింగాయపల్లి వద్ద తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వృథాగా ఉన్న ఈ స్థలంలో 200 ఎకరాల అటవీత ప్రాంతాన్ని తెలంగాణ హరితహారం ద్వారా అభివృద్ధి చేశామన్నారు.

సీఎం కేసీఆర్‌ అడవుల అభివృద్ధి కోసం రెండు రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఆడవులలో మొక్కలు ఉన్నట్లయితే వాటని అభివృద్ధి చేయడం మొదటి రకమైతే., రెండవది ఆడవులలో మొక్కలు లేకుండా నేల మట్టంగా ఉన్నట్లయితే వాటిలో నియామకిన్‌ జపానీస్‌ మాడల్‌ పద్దతిలో దగ్గర దగ్గరగా క్లోజ్‌ ప్లాంటేషన్‌ క్రింద మొక్కలు పెంచుతూ ఆడవులకు పునరుజ్జీవం చేశామన్నారు.

ముఖ్యంగా కృత్రిమ పునరుజ్జీవ పద్దతి, సహాజ పునరుజ్జీవ పద్దతిలో ఈ అటవీ వనాల పెంపు బాగుందని, వాటి రక్షణకు చేపట్టిన చర్యలను గురించి మంత్రి హరీశ్ వివరించారు. అడవుల అభివృద్దికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం బాగుందని, తమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఇదే స్థాయిలో అడవులను అభివృద్ది చేస్తామన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సమీకృత మార్కెట్‌కు విచ్చేసిన మంత్రులు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు సిద్ధిపేట జిల్లా అధికారిక యంత్రాంగం తరపున గొల్లభామ చీరెను బహుకరించారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు వచ్చిన వారికి మంత్రి హరీశ్‌రావు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన వెజ్‌, నాన్‌వెజ్‌ స్టాళ్లతో పాటు సూపర్‌మార్కెట్‌, పూలు, పండ్ల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా వ్యాపారులతో కష్ట, నష్టాలను అడిగి తెలుసుకుని ఆరా తీశారు. మార్కెట్‌లో మాంసం, కూరగాయలు, పూలు, పండ్లు, కిరాణా వస్తువులు ఇలా అన్ని ఓకే చోట దొరకడం నిజంగా గొప్ప విషయమన్నారు.

ఇదే స్థాయిలో తమ నియోజకవర్గాల్లో, తమ మునిసిపాలిటీలలో ఏర్పాటు చేసుకుంటామని పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారిక బృందాలు వెల్లడించాయి. మార్కెట్‌ నిర్మాణం గురించి జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వివరించారు.

అనంతరం పట్టణంలోని వైకుంఠధామాన్ని పరిశీలించారు. వైకుంఠధామ నిర్మాణంపై మంత్రి హరీశ్‌రావు సవివరంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు వివరించారు. ఆధునిక హాంగులతో నిర్మించిన ఈ వైకుంఠధామం స్మశానంలా కాకుండా పార్కులా అభివృద్ది చేశారని టూర్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది.

సువిశాల స్థలంలో సంగాపూర్‌లో నిర్మించిన కల్పకవనం అర్భన్‌పార్కును పరిశీలించారు. అర్భన్‌ పార్కులో ఏర్పాటు చేసిన రాశీపార్కు(నక్షత్రపార్కు), గజబౌలిలను, ట్రాక్‌, ఆట వస్తువులు, ప్రవేశ ద్వారంలను గురించి మంత్రి హరీశ్‌రావు సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

పరవళ్లు తొక్కుతున్న పాపాగ్ని నది

Satyam NEWS

అధికార దూతగా వచ్చారా? అసమ్మతి నేతగా వచ్చారా?

Satyam NEWS

వాట్సాప్ ద్వారా ఐఐటీ -జేఈఈ ఫోరమ్ బుక్ లెట్

Satyam NEWS

Leave a Comment