27.7 C
Hyderabad
May 4, 2024 10: 50 AM
Slider ప్రపంచం

IMF నుంచి తప్పుకోనున్న చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్

అంత‌ర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ ఎకాన‌మిస్ట్‌ గీతా గోపినాథ్ తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. జనవరి నుంచి ఆమె తిరిగి హార్వర్డ్ యూనివర్సిటీ సేవల్లో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్రం విభాగంలో పనిచేశారు. అక్కడి నుంచి తాత్కాలిక విరామం తీసుకుని ఐఎంఎఫ్ సేవల్లో చేరారు.

మూడేళ్ల పాటు ఆమె ఐఎంఎఫ్‌లో కొనసాగేందుకు వీలుగా.. ఆమెకు కల్పించిన బ్రేక్ టైమ్‌ను ప్రత్యేక సందర్భంగా పరిగణిస్తూ ఏడాది పాటు హార్వర్డ్ యూనివర్సిటీ పొడగించింది. ఐఎంఎఫ్‌లో మూడేళ్లు పూర్తి చేసుకున్న ఆమె.. తన పదవి నుంచి వైదొలగి మ‌ళ్లీ హార్వర్డ్ యూనివ‌ర్సిటీ ఆర్థిక‌శాస్త్రం విభాగంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఐఎంఎఫ్‌ను గీతా గోపినాథ్ వీడనున్నారన్న విషయాన్ని ఐఎంఎఫ్ అధికార వర్గాలు ధృవీకరించాయి.

Related posts

బోధ వ్యాధి నిర్మూలన శిక్షణ కార్యక్రమం

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: కడప లో రెండు కరోనా అనుమానిత కేసులు

Satyam NEWS

భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన సి.ఎం. కేసీఆర్

Satyam NEWS

Leave a Comment