30.7 C
Hyderabad
April 29, 2024 03: 53 AM
Slider నల్గొండ

బోధ వ్యాధి నిర్మూలన శిక్షణ కార్యక్రమం

#lingagiri PHC

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బోధ వ్యాధి నిర్ములనపై మంగళవారం శిక్షణా కార్యక్రమం  జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరాజు మాట్లాడుతూ నిర్మూలనకు గాను మాత్రల పంపిణీని ఈనెల 15,16,17 తేదీలలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. బోధవ్యాధి క్యూలెక్స్ దోమ కుట్టడం ద్వారా వ్యాపిస్తుందని,దీని నిర్ములనకు    డై ఈతేయిల్ కార్బోమైజిన్ సిట్రేట్(డిఇసి) ఆల్బెండజోల్ మాత్రలు భారీ మొత్తంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ మాత్రలను 2 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భవతులు,ఇతర మైన తీవ్ర రుగ్మతలతో బాధపడేవారు తీసుకోరాదని సూచించారు. డిఇసి,ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కొరకు ఆశా కార్యకర్తలు,స్వచ్ఛంద వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి.హెచ్.ఎన్ నూర్జహాన్ బేగం,ఇందిరాల రామకృష్ణ, ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెడ్ హ్యాండెడ్: ఏసీబీకి దొరికిన అవినీతి డిప్యూటీ తాసిల్దార్

Satyam NEWS

ఎలక్షన్ ఫైర్: విపక్షాల కుట్రలు ప్రజలు నమ్మరు

Satyam NEWS

పౌర విమానయానంలో నైపుణ్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏమిటి?

Satyam NEWS

Leave a Comment