40.2 C
Hyderabad
April 26, 2024 11: 01 AM
Slider ప్రపంచం

బ్రిటన్‌ను వణికిస్తున్న కరోనా.. మరో వేరియంట్‌ గుర్తింపు

తాజాగా బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్‌ వెలుగు చూసింది. డెల్టా వేరియంట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. డెల్టాప్లస్‌ ఏవై.4.2గా పిలుస్తున్నారు. కొత్త వేరియంట్‌ కారణంగానే బ్రిటన్‌లో కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు భావిస్తున్నారు.

డెల్టా వేరియంట్‌కు చెందిన 484కె, 484క్యూ రకం వైరస్‌లు కొద్దిరోజులుగా ఇంగ్లండ్‌లో వ్యాపిస్తున్నాయి. ఏవై.4.2 కారక కేసులూ వెలుగుచూశాయి. ఇదేమీ పెద్ద ఆందోళనకర వైరస్‌ కాదని నిపుణులు అంటున్నారు. తొలిసారిగా గత జులైలోనే ఈ వైరస్‌ను గుర్తించామని, అప్పట్నుంచి దీని వ్యాప్తిని గమనిస్తున్నామని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

Related posts

నో టాక్స్:అక్రమంగా రవాణా 30కిలోలబంగారం స్వాధీనం

Satyam NEWS

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

Satyam NEWS

చదివేది ఇంజనీరింగ్ చేసేది చోరీలు

Bhavani

Leave a Comment