37.7 C
Hyderabad
May 4, 2024 14: 38 PM
Slider వరంగల్

నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా సభ్యుడి అరెస్టు

#WarangalPolice

తక్కువ ధరకు బంగారం అమ్ముతామని చెప్పి నకిలీ బంగారాన్ని అందజేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడిని సి.సి.ఎస్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుడి నుండి 70వేల రూపాయల నగదు రెండు బంగారు గుండ్లు, నకిలీ బంగారం గుండ్ల దండలుతో పాటు ప్లాస్టిక్ పూలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మహరాష్ట్ర లోని నాగపూర్ కు చెందిన కిషన్ రాథోడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాయరణ బగేల్, రవికలాని, గణేష్ కనయ్ సోలంకి, బబ్లూ రాథోడ్, జ్యోతి బగేల్ పరారీలో ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.పి పుష్పా వివరాలను వెల్లడిస్తూ  కిషన్ రాథోడ్ కి ప్రస్తుతం పరారీలో వున్న ముఠా సభ్యులందరు దగ్గరి బంధువులు కావడంతో ముఠా సభ్యులందరు మహరాష్ట్రలో ప్లాస్టిక్ పూలను తయారు చేసి అమ్మగా వచ్చిన అదాయంతో నిందితులందరూ మద్యం సేవించి జల్సాలు చేసేవారు.

వచ్చే అదాయం తమ జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కందకాలు తవ్వగా బంగారం దొరికింది ఈ బంగారం తక్కువ ధరకు అందజేస్తామని చెప్పి నకిలీ బంగారు గుండ్ల దండలను అందజేసి ప్రజలను మోసం చేయడం మొదలు పెట్టారు. ఇందుకోసం నిందితులు తమ స్వంత రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మోసాలకు సిద్ధమైనారు. ఇందులో భాగంగా ఈ ముఠా సభ్యులు వరంగల్ నగరానికి గత నెలరోజు క్రితం చేరుకున్నారు.

ముఠా సభ్యులు అనుకున్న విధంగానే ముఠాలో సభ్యుడు కిషన్ రాథోడ్ హన్మకొండలోని ఓ మిఠాయి దుకాణదారుని వద్ద మిఠాయి కోనుగోలు చేసే క్రమంలో నిందితుడు స్వీట్ షాపు యజమానితో పరిచయం పెంచుకోని తాము గుంటలు తీసేపని చేస్తామని, గుంటలు తీసే సమయంలో మాకు బంగార గుండ్ల గోలుసు దొరికిందని దానిని తక్కువ ధరకు అమ్ముతామని నమ్మబలికారు.

నిందితుడు గుండ్ల గోలుసు నుండి ముందుగా ఏర్పాటు చేసుకున్న నిజమైన రెండు బంగారు గుండ్లను స్వర్ణకారుడి వద్ద తనిఖీ చేసుకోని స్వీట్ షాపు యజమాని అందజేసాడు. ఈ నెల 2వ తేదిన ఈ ముఠా సభ్యులను దూరంగా వుంచి ప్రధాన నిందితుడు స్వీట్ షాపు యజమానితో రెండు లక్షలకు ముఠా వద్ద వున్న బంగారం గొలుసును (నకిలీ బంగారం) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చకోని ఇందుగాను షాపు యజమాని నుండి పదివేల రూపాయల అడ్వాస్సుగా నిందితుడు తీసుకోని పరారయినాడు.

ఇదే తరహలో కొద్ది రోజుల క్రితం ఈ ముఠా సభ్యులు హన్మకొండలోని ఓ ఆర్.యం.పి డాక్టర్‌తో పరిచయం చేసుకోని అతని వద్దనుండి నాలుగు లక్షలు తీసుకోని నకిలీ బంగారు గుండ్ల గోలుసులను అందజేసి మోసం చేసారు.

ఈ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సూచన మేరకు సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డి.సి.వి పుష్పా మరియు క్రైం ఎ.సి.పి బాబురావు అధ్వర్యంలో సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, హన్మకొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ తమ సిబ్బందితో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు అందుబాటులో అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోని నిందితుడి కదలికలపై నిఘా పెట్టి ఈ రోజు ఉదయం హన్మకొండలోని అమృత టాకీస్ వద్ద పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

నిందితుడుని సకాలంలో అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సి.సి.ఎస్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, హన్మకొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్, సిసిఎస్, హన్మకొండ ఎస్.ఐలు రాజేందర్, నవీన్ కుమార్, అసిస్టెంట్ అనాలిటికల్ ఆఫీసర్ సల్మాన్ పాషా, సి.సిఎస్ ఎ.ఎస్.ఐ వీరస్వామి, హెడ్ కానిస్టేబుళ్ళు ఇనాయత్ ఆరీ, జంపయ్య, కానిస్టేబుళు ఎ. విశ్వేశ్వర్, వంశీ, నజీరుద్దీన్లను వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్ అభినందించారు.

Related posts

సజావుగా వానాకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

Satyam NEWS

కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ఆరోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

Leave a Comment