25.2 C
Hyderabad
May 8, 2024 08: 22 AM
Slider ముఖ్యంశాలు

దళిత బంధు సర్వే ప్రారంభం

#dalitbandhu

జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాల దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు మంజూరుచేస్తూ జీవో 16 ని సెప్టెంబర్ 30న విడుదల చేసిందని, ఇట్టి ఆదేశాల మేరకు సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాల్లో దళితబంధు సర్వే ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి, లబ్దిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 77455 మంది ఎస్సి జనాభా ఉండగా, 25143 కుటుంబాలు ఉన్నట్లు, బోనకల్ మండలంలో 14567 మంది ఎస్సి జనాభా ఉండగా 4922 ఎస్సి కుటుంబాలు ఉన్నట్లు ఆయన అన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మొత్తం 30065 ఎస్సి కుటుంబాలకు కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 3006.50 కోట్ల రూపాయలు అందనున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్ మండలాలను 35 క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టర్ కి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా, మండల స్థాయిలో పర్యవేక్షణకు ఒక్కో మండలానికి ఒక ఉన్నతాధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు ఆయన తెలిపారు.

సర్వే ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిచేసి, ప్రతి దళిత కుటుంబానికి వారు కోరే యూనిట్ల గ్రౌండింగ్ కి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. లబ్ధిదారులు యూనిట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, కుటుంబంలోని వారే యూనిట్లను పూర్తి స్థాయిలో నిర్వహించుకొనేలా ఉండాలని ఆయన తెలిపారు. అనుభవం, నైపుణ్యం గల యూనిట్లను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, మండలంలోని 3642 దళిత కుటుంబాలకు, నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున 483 కుటుంబాలకు, మొత్తంగా 4125 కుటుంబాలకు కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున రూ. 412.50 కోట్లు అందజేసినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దళితులు చేరుకోవాలని ఆయన అన్నారు. దళితులు సమాజంలో గౌరవంగా బతకాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, అమలుచేస్తుందని అన్నారు. దళితులను ఆర్థిక, సామాజిక వివక్ష నుండి దూరంచేసి, వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు.

Related posts

బతుకమ్మ పండుగకు ఫిదా అయిన ఐపిఎస్ అధికారి సతీమణి

Satyam NEWS

వరంగల్ కమీషనర్ గా రంగనాథ్

Murali Krishna

భజన చేసేవారికే ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబునాయుడు

Satyam NEWS

Leave a Comment