29.7 C
Hyderabad
May 4, 2024 04: 06 AM
Slider నిజామాబాద్

జుక్కల్ నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి

#JukkalConstituency

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మద్నూర్ జుక్కల్ పెద్దకొడప్గల్ పిట్లం నిజాంసాగర్ మండలాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్  వర్దంతి సందర్బంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

బిచ్కుంద మండలంలో ఎంపీపీ అశోక్ పటేల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా గుర్తించారన్నారు. అటువంటి మహనీయుడు చూపిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ ను ఒకే వర్గానికి పరిమితం చేయడం సమంజసం కాదని భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రతి అంశం ప్రతి ఒక్కరికీ సంబంధించినదన్నారు.

పధ్ధెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్ గారి కే దక్కుతుందన్నారు. మహిళలకు సమానత్వం కూడా ఆయనదేనన్నారు.

అటువంటి మహనీయునికి ఒకే వర్గానికి అంటగట్టి ఆయనను అవమానిస్తున్నామని భారత రాజ్యాంగంలో అన్ని వర్గాలకు ఆయన దిశా సూచించారని మరోసారి గుర్తుచేశారు.

ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు   పొందడమే మన భారత దేశానికి గర్వకారణమని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

Related posts

సర్వీస్: విద్యార్ధులలో సేవాభావాన్ని పెంపొందించాలి

Satyam NEWS

How Can You Lower Blood Sugar

Bhavani

ఉపాధి జాబ్ కార్డు కావాల్సినవారు తీసుకోవచ్చు

Satyam NEWS

Leave a Comment