విద్యార్థులో ఉన్న సేవాభావాన్ని పెంపొందించడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ చాల ఉపయోగపడుతుందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్.డి.ఓ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థులకు గురువారం యూనిఫామ్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరితే విద్యార్థులు క్రమ శిక్షణ తో మెలగటం తో పాటు సేవ భావం కూడా కలిగి ఉంటారని అన్నారు. అలాగే ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున విద్యార్థులు కొండ కింద ,పైన అనేక సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ హై స్కూల్, ఓరియంటల్ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ స్టేట్ ఆర్గనైజేర్ పి.శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు
previous post