33.2 C
Hyderabad
May 15, 2024 22: 03 PM
Slider ప్రపంచం

ఈ నెల12న గ్రీన్‌ కలర్‌ తోకచుక్క దర్శనం

డిసెంబర్ 12న లియోనార్డ్ తోకచుక్క భూమికి దగ్గరగా రానుంది. ఐతే… ఇది డిసెంబర్ నెలంతా ఆకాశంలో కనిపిస్తూనే ఉంటుంది. కానీ… స్పష్టంగా చూడాలంటే డిసెంబర్ 12నే చూడాలి. ఈ సంవత్సరంలో భూమిపై ఉన్నవారికి కనిపించే అత్యంత కాంతివంతమైన తోకచుక్క ఇదే.

దీన్ని 2021 జనవరిలో గురుగ్రహం దగ్గర్లో ఉన్నప్పుడు కనిపెట్టారు. ఇది భూమికి దగ్గరగా వస్తున్నా… దీని టార్గెట్ మాత్రం సూర్యుడేనట. త్వరలోనే సూర్యుణ్ని చేరుకుని… సూర్యుని చుట్టూ ఓ రౌండ్ వేసి… తిరిగి తన గెలాక్సీవైపు వెళ్లిపోతుందట.

సాధారణంగా తోకచుక్కలు పసుపురంగులో కనిపిస్తాయి. ఇది మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే రసాయనాలు మండుతూ… చుట్టూ గ్రీన్ కలర్ మెరుపులు వస్తాయి. తోక మొత్తం గ్రీన్ కలర్‌లోనే ఉంటుంది. ఇలాంటి గ్రీన్ కలర్ తోకచుక్క భూమికి దగ్గర్లో రావడం 70,000 సంవత్సరాల్లో ఇదే తొలిసారి. ఈ తోకచుక్క జనవరి 3, 2022 నాడు సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. ఆ సమయంలో ఇది అత్యంత కాంతివతంగా కనిపిస్తుంది. కాకపోతే చాలా చిన్నగా కనిపిస్తుంది.

Related posts

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు

Bhavani

ఈ నెల 25 న ఏపీ రాష్ట్ర బంద్…!

Bhavani

డ్రగ్ రాకెట్: మైలవరంలో గంజాయి కలకలం

Satyam NEWS

Leave a Comment