39.2 C
Hyderabad
April 30, 2024 19: 51 PM
Slider ప్రపంచం

సింగపూర్‌ ప్రయాణికులకు ఇండియా ఊరట

సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చే ఎన్నారైలు, అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించిన అట్‌ రిస్క్‌ దేశాల జాబితాలో నుంచి సింగపూర్‌ను తొలగించింది. ఇక అదే సమయంలో ఆ జాబితాలో కొత్తగా టాంజానియా, ఘనా దేశాలను చేర్చింది.

సౌతాఫ్రికా వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు మరింతగా పెంచారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌ పరీక్షలు, ఆ తర్వాత క్వారంటైన్‌ నిబంధనలు విధిస్తున్నాయి.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం ఉన్న దేశాల జాబితాను అట్‌రిస్క్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అట్‌ రిస్క్‌ జాబితాలో ముందుగా సింగపూర్‌, ఇజ్రాయిన్‌, జింబాబ్వే, న్యూజిలాండ్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, యూకే, ఇజ్రాయిల్‌, హాంగ్‌కాంగ్‌ దేశాలు ఉన్నాయి.

తాజాగా ఈ జాబితాను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ జాబితా నుంచి సింగపూర్‌ దేశాన్ని తొలగించింది. ఇక నిబంధనల ప్రకారం.. ఇక నుంచి సింగపూర్‌ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాలలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Related posts

బియ్యం చుట్టూ తిరుగుతున్న కారు కమలం కయ్యం

Satyam NEWS

సంతాపం: జన నాయకుడికి అశ్రునివాళి

Satyam NEWS

[Free|Trial] My Mother’s Blood Sugar Has Been High For Days Diabetes Medications Linagliptin Lower A1C Fast Naturally

Bhavani

Leave a Comment