40.2 C
Hyderabad
May 5, 2024 15: 15 PM
Slider నల్గొండ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతీ ఒక్కరి బాధ్యత

#Chirumarthy Lingaiah MLA

హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో    చిట్యాల పోలీసు స్టేషన్ ఆవరణలో  మొక్కలు నాటిన అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ రంగనాథ్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ పుడమి పచ్చగుండాలే-మన బతుకులు చల్లగుండాలి అని టీఆర్ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో దశకు చేరుకుందని తెలిపారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి  నేల తల్లికి పచ్చని పందిరి వేయాలన్న సంతోష్ ఆశయాన్ని గౌరవించాలని, మనమంతా బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా తీసుకోని మొక్కలు నాటాలని ఎమ్మెల్యే చిరుమర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, సి ఐ శంకర్ రెడ్డి, ఎస్ ఐ నాగరాజు, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి పాల్గొన్నారు.

ఇంకా, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, నాయకులు పాటి మాధవ రెడ్డి, మెండే సైదులు, వెలుపల్లి మదుకుమార్, జిట్టా బొందయ్య, సిలివేరు శేఖర్, ఎండి జమీరొద్దీన్, పందిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం ఉత్సవాలలో ఉత్సాహం వెల్లివిరియాలి

Satyam NEWS

మీర్ పేట్ లో భూగర్భం డ్రైనేజీ పనులు ప్రారంభం

Satyam NEWS

బాన్సువాడ ఆటోనగర్ కు శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment