40.2 C
Hyderabad
April 26, 2024 12: 35 PM
Slider రంగారెడ్డి

మీర్ పేట్ లో భూగర్భం డ్రైనేజీ పనులు ప్రారంభం

#MeerpetCorporation

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16 వ వార్డు డివిజన్ లో ఎంతో కాలంగా పెండింగులో ఉన్న భూగర్భ డ్రైనేజీ లీకేజీ సమస్యను పరిష్కరించే పనులను కార్పొరేటర్  ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ నేడు ప్రారంభించారు.

సమస్యను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆమె తక్షణ చర్యలు తీసుకున్నారు. తిరుమలనగర్ కాలని,  జై భారత్ నగర్ కాలని, శ్రీ సాయి కృపా నగర్ కాలనీలను చాలా కాలంగా పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్యను  తొందరగా తీర్చాలనే ఉద్దేశంతో  మంత్రి తక్షణ ఆదేశాలిచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగలవిక్రమ్ రెడ్డి హాజరయ్యారు. భూగర్భ డ్రైనేజి పైపులైను పనులను కొబ్బరి కాయలు కొట్టి పనులను  మొదలు పెట్టారు.

ఈ కార్యక్రమంలో 16 వ వార్డు కార్పొరేటర్  ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ తో బాటు వివిధ కాలనీ అధ్యక్షులు మేకల యాదగిరి, విద్యాధర్ భట్ట్, మన్నెం రెడ్డి, చంద్రు నాయక్ వివిధ కాలనీవాసులు పాల్గొన్నారు.

Related posts

రత్నప్రభ కు తిరుపతి టిక్కెట్ వెనుక జగన్ హస్తం!

Satyam NEWS

ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల ఆన్లైన్ ప్రదర్శన

Satyam NEWS

నర్సులకు మాస్కులు అందించిన నర్సింగ్ అసోసియేషన్

Satyam NEWS

Leave a Comment