Slider ప్రత్యేకం

పూల డెకరేషన్లో పచ్చి విషం

#flower decoration

పూల డెకరేషన్లో పచ్చి విషమా? అవును ఇది నిజం. పెళ్లి వేడుకల్లో పూల డెకరేషన్ చేయడం సహజం. దానికోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం సహజమే. అసహజమేమిటంటే ఆ పూలల్లో ఈ మధ్యకాలంలో పచ్చి విషాన్ని చేర్చేశారు డెకరేటర్లు. ఇది తెలిసి జరుగుతుందో, తెలియక జరుగుతుందో అంతు పట్టడం లేదు. డెకరేషన్ లో పార్ధీనియం (వయ్యారిభామ) మొక్క చేరిపోయింది. ఈ మొక్క పూలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.

సన్నటి తెల్ల పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే మొక్క నుంచి వచ్చే గాలి అత్యంత ప్రమాదకరమైనది. ఈ మొక్కను కొన్ని మందుల్లో వాడతారు. ఎన్నో రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉంది. అయితే ఇది విషాన్ని వెదజల్లుతూ ఉంటుంది. పశువులు మేస్తే రోగాల బారిన పడతాయి. ఈ మొక్క నుంచి వచ్చే గాలి విషపూరితం. చిన్నపిల్లలు ఈ మొక్కల గాలిని పీల్చితే స్పృహ తప్పుతారు. ఈ మొక్కలు ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి.

దీనిని పల్లెల్లో వయ్యారిభామగా వ్యవహరిస్తారు. పల్లె వాసులకు దీని గురించి తెలుసు. అందుకే ఇది కనబడితే పీకి పారేస్తారు. ఇది కలుపుగా కూడా మొలుస్తుంది. కొందరికి మాత్రం ఇది ప్రమాదకారి అనే విషయం తెలియదు.

తెలియని వారు పిల్లల్ని ఆ మొక్కల్లో ఆడుకొనిస్తే, ఒంటికి దురద, దద్దుర్లు వస్తాయి. అది ఎందుకు వచ్చిందో తెలియక అయోమయానికి గురి అవుతుంటారు. తెలిసినవారు చాలా జాగ్రత్త పడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇది ఇప్పుడు పూల డెకరేషన్ లో వచ్చి చేరింది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే మొక్క ఒక కొత్త సొగసును ఇస్తోంది.

చాలామందికి దీని గురించి తెలియక పోవడం వల్ల డెకరేటర్లు దీనిని డెకరేషన్ లో చేర్చేశారు. ఇటీవల లలిత జ్యువెలరీ ప్రారంభోత్సవానికి నేను వెళ్లాను. అక్కడ డెకరేషన్ లో మొత్తం వయ్యారి భామనే వాడేశారు. చూస్తే నాకు మతిపోయింది. ఇంతటి భయానక విషయాన్ని, ఇంత నిర్భయంగా మొత్తం డెకరేషన్ లో వాడటాన్ని నా పక్కన ఉన్న మిత్రులకు చూపిస్తే వాళ్లు ఆశ్చర్యపోయారు. అవునే అని ముక్కున వేలేసుకున్నారు.

అంతకు ముందు నేను కొన్ని పెళ్లిళ్లలో దూరం నుంచి చూసి అది అవునో కాదో తెలియక అయోమయానికి గురయ్యాను. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నిర్ధారణ చేశాను. ఆదమరిస్తే సువాసనలు వెదజల్లాల్చిన పూల పందిళ్ళలో ఈ విషాన్ని నింపే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త.
ఫయాజ్, సీనియర్ జర్నలిస్ట్. 8886833033

Related posts

తెలంగాణాలో 7వ శాఖను ప్రారంభించిన సానీ ఇండియా

Satyam NEWS

సిఏఏ నిబంధనల రూపకల్పనలో మరింత జాప్యం

Satyam NEWS

రషీద్ ఎన్ కౌంటర్

Murali Krishna

Leave a Comment