29.7 C
Hyderabad
May 4, 2024 03: 49 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ నేతలపై హరీష్ ఫైర్

#Harish rao 55

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ నాయకులు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా మాట్లాడారు. రైతుల పట్ల కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంది. కాంగ్రెస్‌పై రైతులు తిరగబడుతున్నారు. కరెంట్‌పై కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యునిపై ఉమ్మి వేసినట్లే.

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం పెద్ద జోక్. రైతులపై కాల్పులు జరిగిన రోజే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కేసీఆర్ అప్పటి సీఎంకు లేఖ రాశారు. ఉద్యమం పుట్టిందే కరెంట్ నుంచి. కేసీఆర్‌పై ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు. కాంగ్రెస్ నేతలు వెళ్లి కరెంట్ వైర్ ముట్టుకొండి. 24 గంటల కరెంట్ వస్తుందో లేదో తెలుస్తోంది.”

అని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా.. బీఆర్ఎస్ పాలనలో బాగుందో దమ్ముంటే రండి రెఫరెండం కొరదాం. వచ్చే ఎన్నికల్లో కరెంట్‌పై రెఫరెండం కొరదాం వస్తారా. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలో.. మతం పేరిట మంటలు పెట్టే బీజేపీ కావాలో.. 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి.

ఉచిత విద్యుత్ వద్దన్న పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు. కాంగ్రెస్ నేతలు బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి. మేము మీటర్లు పెడతాం అనడం హాస్యాస్పదం. మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతామని కేంద్రం చెప్పింది. రైతుల కోసం మేము రూ. 35 వేల కోట్లు వదులుకున్నాం.

దాసోజు శ్రావణ్‌ను చంపుతామని బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడుపుతుందా.” అని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.కాగా రాజాసింగ్ హాస్పిటల్ పని కోసం వచ్చి కలిశారని చెప్పారు…

Related posts

షట్ డౌన్: ఇంటర్ నెట్ డిస్కనెక్ట్ వల్ల 9 వేల కోట్లు కట్

Satyam NEWS

9న కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగే ఆందోళన జయప్రదం చేయండి

Satyam NEWS

హత్యా రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్

Bhavani

Leave a Comment