29.7 C
Hyderabad
May 2, 2024 03: 25 AM
Slider జాతీయం

షట్ డౌన్: ఇంటర్ నెట్ డిస్కనెక్ట్ వల్ల 9 వేల కోట్లు కట్

no internet

వివిధ సమస్యల కారణంగా ఇంటర్నెట్‌ను డిస్‌కనెక్ట్ చేయడం ద్వారా దేశం రూ.9,200 కోట్లు కోల్పోయింది. ఇది ప్రపంచంలోని ఇంటర్నెట్ డిస్‌కనక్షన్ల అంశంపై టాప్ 10 VPN అధ్యయనంలో తేలింది.  వరల్డ్ ఇంటర్నెట్ సొసైటీ ఈ అధ్యయనం చేసింది. వరల్డ్ ఇంటర్నెట్ సొసైటీ వారు ప్రపంచ బ్యాంక్, ఐటిసియు, యూరోస్టాట్, యుఎస్ సెన్సస్ బ్యూరోలతో కలిసి పని చేస్తుంది.

ఆఫ్రికాలో ఇంటర్నెట్ లేకపోవడం వల్ల 300 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద ఆర్థిక నష్టం జరిగింది. భారత్ లో ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ కారణంగా 230 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద నష్టం జరిగిన దేశంగా గుర్తింపు పొందింది.  2019 లో భారతదేశంలో 100 కి పైగా ఇంటర్నెట్ డిస్‌కనక్షన్లు జరిగాయి. అధ్యయనం ప్రకారం వినియోగదారు 4,196 గంటల ఇంటర్నెట్ వినియోగాన్ని కోల్పోయారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ డిస్‌కనెక్ట్ అయిన విషయం తెలిసిందే.

కాశ్మీర్ లో ఇంటర్నెట్‌ను డిస్‌కనెక్ట్ చేయడం వల్ల దేశానికి 110 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అధ్యయనం వెల్లడించింది.  CAA వ్యతిరేక నిరసనలు వ్యాపించడంతో, దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఇంటర్నెట్ సేవలు రద్దు చేశారు. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఇంటర్నెట్ షట్డౌన్ ట్రాకర్ ప్రకారం, గత సంవత్సరం ప్రపంచంలోని ఇంటర్నెట్ డిస్కనెక్ట్ లలో భారతదేశం 67 శాతం వాటా ఉంది. గత ఏడాది డిసెంబర్ 15 నాటికి, భారతదేశం అంతటా ఇంటర్నెట్ 95 సార్లు డిస్ కనెక్ట్ చేశారు.

Related posts

డబ్బుల రాజకీయానికి కాదు ప్రజాసేవకులకు ఓటేయండి

Satyam NEWS

కరోనా వేళ… ఆరుగురు మహిళా పోలీసుల తెగువ ఇది….

Satyam NEWS

పాత్రికేయుల కుటుంబ సంక్షేమమే శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment