దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రైతుల పోరాటం 250 రోజులు, ఆంధ్రప్రదేశ్ లో రైతుల పోరాటం 600 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సంఘీభావంగా ఈ నెల 9న సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాసమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.
రైతు చట్టాల సవరణ,కార్మిక చట్టాల సవరణ నిలుపుదల చేయాలని, పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని నిత్యవసర ధరల మీద నియంత్రణ లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులైన గోపాలపురం సర్పంచ్ శాసనాలు నాగ సెదులు, బూరుగడ్డ సర్పంచ్ షేక్ సలీమాబేగం, వేపలసింగారం సర్పంచ్ మన్నం కోండారెడ్డి, ఎంపిటిసి ముడెం గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
9వ తేదీన కలెక్టరేట్ ఎదుట జరప తలపెట్టిన ఆందోళనకు కదిలి రావాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా నాయకులు షేక్ ముస్తాఫా,గోవిందు, వెంకటేష్, వెంకటేశ్వరరావు తదితరులు కూడా పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్