40.2 C
Hyderabad
May 5, 2024 16: 38 PM
Slider ప్రత్యేకం

Hats off: మీలాంటి వారే ఈ సమాజానికి కావాలి టీచర్

#10thclass

కరోనా కారణంగా పాఠశాల కు దూరమైన విద్యార్థులు పరీక్షలు రాయడానికి మానసికంగా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విడమరచి చెప్పలేని తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలో అర్ధం కావడం లేదు.

ఈ విషయాన్ని ముందుగానే గమనించిన నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ఇలాంటి విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పదవ తరగతి తెలుగు పరీక్షకు హాజరుకాని ఇలాంటి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని నిలిపి ప్రధానోపాధ్యాయురాలు ప్రోత్సాహంతో పరీక్షకు వెళ్లిన విద్యార్థి ఆ విద్యార్థులను పరీక్షకు వెళ్ళే విధంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కొల్లాపూర్ గాంధీ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థి లింగస్వామి తెలుగు, హిందీ పరీక్షలకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు శోభారాణి లింగస్వామి  తల్లిదండ్రులను కలిసి వారితో మాట్లాడారు.

తల్లిదండ్రుల  వెంట చేపలు పట్టడానికి వెళుతున్న లింగస్వామికి కూడా కౌన్సిలింగ్ చేశారు. చదువుకోవటం వల్ల కలిగే లాభాల గురించి అతని తల్లిదండ్రులకు శోభారాణి వివరించారు. ఆ విద్యార్థిని పరీక్షకు వెళ్ళే విధంగా ఒప్పించి, ఈరోజు ఉదయం ఒక ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా నియమించి ఆ విద్యార్థిని పరీక్ష కు వెళ్ళే విధంగా చేశారు.

హెడ్మాస్టర్ శోభారాణితో బాటు ఉపాధ్యాయులు కురుమయ్య, శ్రీకాంత్, శీనయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల బృందం అన్ని చోట్లా ఉంటే స్కూల్ డ్రాపౌట్స్ ఉండరు. హేట్సాఫ్ టు ఉపాధ్యాయుల బృందం.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీ గ్రామాలు

Satyam NEWS

కోడలి తల నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయిన అత్త…

Satyam NEWS

ఈ నెల 15న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Satyam NEWS

Leave a Comment