40.2 C
Hyderabad
April 29, 2024 17: 13 PM
Slider ఆదిలాబాద్

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీ గ్రామాలు

#tribalsprotest

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆదివాసీల గ్రామాలకు సరైన కనీస సౌకర్యాలు లేవు… ఇది నిజం…. నమ్మలేని నిజం. ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పడం కరెక్టు కాదు. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని డేడ్రా, గిరిజాయి, పుర్క ఉమడ, గోసాయి ఉమడ,  మాన్కపూర్, ఇంద్రానగర్, గ్రామాలకు రోడ్డు సౌకర్యం, త్రీఫేస్ కరేంటు, PHC సెంటర్, సేల్ టవర్స్ లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, గ్రామ పటెల్స్ ఆద్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

రోడ్డు సౌకర్యం లేని మూలంగా ఇప్పటికే చాలా మంది మహిళలు డెలివరీ సమయంలో మార్గం మధ్యలోనే ప్రసవం కావడం మార్గం మధ్యలోనే తల్లి లేదా బిడ్డలు మరణించిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇవే కాకుండా అనేక విష రోగాల బారిన పడి సరైన సమయంలో వైద్యం అందక పదుల సంఖ్యలో ఆదివాసీలు చనిపోతున్నారు. ఎన్నో సార్లుకేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు చెప్పిన పట్టించుకోనే వారు లేరు.

కనీసం రోడ్లు, కరెంటు, హెల్త్ సెంటర్, సెల్ టవర్స్, ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే రోడ్డు రవాణా,  త్రీఫెస్ కరెంటు, ఆశ్రమపాఠశాల, PHC సెంటర్, సేల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు వారు వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అదిలాబాద్ జిల్లా కమిటీ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, జిల్లా ఉపాధ్యక్షుడు కుంర శ్యాంరావు, జిల్లా ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, A.T.F జిల్లాఅధ్యక్షులు పేందుర్ అర్జున్, జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, మహిళా సంఘం పేందుర్ ,పుష్పరాణి జిల్లా కార్యదర్శి మహిళా సంఘం విద్యార్థి సంఘం సలాం వరుణ్, బి.రాహుల్, మెస్రం దినేష్ , అర్క. గోపాల్, డేడ్రా, గిరిజాయి, మన్కపూర్ ,సర్పంచులు ,యం,పి,టి, ఉమడం,కె, ఉమడం,బి,ఇంద్ర నగర్,పాటేల్స్, ప్రజలు పాల్గొన్నారు.

Related posts

రామతీర్ధం లో రామయ్య పెళ్లికి ఏర్పాట్లు పూర్తి..!

Satyam NEWS

విజయనగరంలో పొంచి ఉన్న ప్రమాదం… పట్టించుకోని అధికార యంత్రాంగం..!

Satyam NEWS

మంత్రాల నెపంతో యువకుడి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment