27.7 C
Hyderabad
May 4, 2024 08: 00 AM
Slider ప్రత్యేకం

చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో తీవ్ర అస్వస్థత

#Chandrababu

చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. డీహైడ్రేషన్ తో పాటు స్కిన్ సమస్యలతో చంద్రబాబు బాధ పడుతున్నారు. జైలు అధికారులు నేడు ప్రభుత్వ వైద్యులను పిలిపించి స్కిన్ సమస్యపై చెక్ చేయించారు. చంద్రబాబుకు స్కిన్ సమస్య తీవ్రమైనట్లు సమాచారం. చర్మం పై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్ తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఎక్కువ మొత్తం లో బరువు తగ్గినట్లు వైద్యులు గుర్తించారు. బరువు తగ్గడాన్ని సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. డీహైడ్రేషన్ ఇతర సమస్యలకు దారి తీయవచ్చునని కూడా తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతల్లో ఆందోళన నెలకొన్నది.

Related posts

కులాంతర వివాహం చేసుకున్న వాల్మీకి ఆడబిడ్డపై భౌతిక దాడులు

Bhavani

నటి శ్రద్ధా శ్రీనాథ్ తో ఆర్ కె ఇంటెర్నేషనల్ చిత్రం “కలియుగం”

Satyam NEWS

25న నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్ ఫిల్మ్ ‘ట‌క్ జ‌గ‌దీష్’ ఫ‌స్ట్ లుక్

Satyam NEWS

Leave a Comment