28.7 C
Hyderabad
April 26, 2024 09: 27 AM
Slider మహబూబ్ నగర్

కులాంతర వివాహం చేసుకున్న వాల్మీకి ఆడబిడ్డపై భౌతిక దాడులు

నాగర్ కర్నూల్ జిల్లా పేంట్ల వెళ్లి మండల కేంద్రంలో కులం బుసలు కొడుతుంది. కురుమ సామాజికవర్గానికి చెందిన బెళ్ళారి అలోజి 14 సంవత్సరాల క్రితం బోయాలపల్లి గ్రామానికి చెందిన లలిత ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 18 సంవత్సరాల అమ్మాయి, 10 సంవత్సరాల బాబు ఉన్నారు. అప్పటి నుంచి అనునిత్యం దాడులు చేస్తూ వారిపై భౌతిక దాడులకు పాల్పడుతునే ఉన్నారు.

ఆలోజి తండ్రి వెంకట స్వామి వారం రోజుల క్రితం చనిపోతే అంత్యక్రియలు చేయాల్సిన కన్న కొడుకునే చంపే యత్నం చేశారు. వెంకట స్వామి పేరు మీద ఉన్న ఆస్తులు సైతం రెవెన్యూ అధికారులతో సొంత కొడుకు కు పేరు మీద కాకుండా పాలి బందువులు పంచుతున్నారు.

నేటి సమాజంలో కులంతరం వివాహం చేసుకుంటే ఇంతటి కక్ష సాధింపులా? దాడులకు పాల్పడిన వారిపై పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. వాల్మీకి బిడ్డ లలితపై జరుగుతున్న దాడికి నిరస కొల్లాపూర్ వాల్మీకి క్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వాల్మీకి సంఘం పేర్కోన్నారు.

Related posts

వి ఎస్ యూ పి జి సెంటర్ కావలి లో ఘనంగా సైన్స్ డే వేడుకలు

Satyam NEWS

ఫెర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేసిన ప్రత్యేక బృందం

Satyam NEWS

బిజెపి రైతు సదస్సులో పాల్గొన్న విజయశాంతి

Satyam NEWS

Leave a Comment