34.7 C
Hyderabad
May 5, 2024 01: 39 AM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డికి షాక్?

#kollapurmla

కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డికి రాజకీయంగా షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆయనకు ఇవ్వాలని 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆందోళన చేసిన ముఖ్య నాయకుడు ఒకరు ఇప్పుడు భీరం హర్షవర్ధన్ రెడ్డిని వదిలేస్తున్నారు.

ఎమ్మెల్యేగా ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన నాయకులు ఆయన పార్టీ మారినా కూడా ఇంతకాలం ఆయన వెంటే ఉన్నారు. అయితే ఇప్పుడు రాజకీయంగా విభేదించిన వారు ఆయన నుంచి దూరం జరుగుతున్నారు. చుక్కాయి పల్లి గ్రామానికి చెందిన ముఖ్య నాయకుడు భాస్కర్ రావు భీరం నుంచి దూరంగా జరుగుతున్నట్లు ప్రకటించారు.

ఈ విషయాన్ని ఆయన సత్యంన్యూస్ ప్రతినిధితో వెల్లడించారు. ఎమ్మెల్యే కోసం కష్ట పడిన వాళ్ళు ఒకరైతే ఇప్పుడు వచ్చి పెత్తనం చేస్తున్నది వేరేవాళ్లనీ ప్రచారం జరుగుతుంది. మొదటి నుండి  ఎమ్మెల్యే కోసం పనిచేసిన వారు ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

దీనితోనే ఇక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ని  వీడుతున్నట్లు చుక్కాయి పల్లికి చెందిన (మున్సిపాలిటీ రెండవ వార్డు) ముఖ్య నాయకులు భాస్కర్ రావు స్వయంగా  సత్యం న్యూస్ కు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన ఎంతో కృషి చేశారు.

కానీ వారిపై పోటీ చేసిన వారిని ఎమ్మెల్యే పార్టీలోకి తీసుకోవడం, వచ్చాక తమపై పెత్తనం చేయడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. వారి బాటలో మరి కొందరు పక్కకు వెళుతున్నట్లు సమాచారం అందుతుంది.

Related posts

సమ్మె: రామగుండంలో విధులకు హాజరుకాని కార్మికులు

Satyam NEWS

బాధిత కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ భ‌రోసా

Bhavani

కారు సారూ:పెద్దపల్లి మున్సిపాలిటీ పై గులాబీ జెండా

Satyam NEWS

Leave a Comment