33.2 C
Hyderabad
May 4, 2024 03: 00 AM
Slider ముఖ్యంశాలు

ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వమే సుప్రీం

#BRN party

మణిపూర్ పై చర్చ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం కావాలని అవలంభిస్తున్న మొండి వైఖరిని నిరశిస్తూ న్యూఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎన్ పార్టీ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోక్ సభ లీడర్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.

సేవ్ మణిపూర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలి పెట్టులాంటి ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఈ బిల్లు అప్రజాస్వామికమని నిరశించారు. ఎన్డీయే ప్రభుత్వం పెడరిలిజాన్ని ఖూనీ చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే సుప్రీం అని నామ అన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సమాఖ్య న్పూర్తికి విరుద్ధమని నామ స్పష్టం చేశారు.

అందుకే బీఆర్ఎన్ పార్టీ కేంద్ర వైఖర్ని తీవ్రంగా వ్యతిరేకి స్తుందన్నారు.ఏ మాత్రం ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉన్నా సత్వరమే ఢిల్లీ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని నామ కేంద్రాన్ని కోరారు. ఈ ధర్నాలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాసరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, సంతోస్ కుమార్, బండి పార్ధసారధిరెడ్డి. సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దివికొండ దామోదరరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమలలో తగ్గిపోయిన భక్తుల రద్దీ

Satyam NEWS

ప్రతి ఒక్కరూ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి

Satyam NEWS

అన్నదాతల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా కొత్త చట్టాలు

Satyam NEWS

Leave a Comment