37.2 C
Hyderabad
May 6, 2024 14: 28 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో తగ్గిపోయిన భక్తుల రద్దీ

thD47TS12Q

తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. వారికి రెండు గంటల సమయంలోపే స్వామి దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. చలి అధికంగా ఉండటం, సెలవులు లేకపోవడంతోనే రద్దీ తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు గంటన్నర వ్యవధిలోనే దర్శనం అవుతుండగా, ప్రత్యేక, దివ్య దర్శనం భక్తులకూ అంతే సమయం పడుతోంది. అందులో కూడా క్యూ లైన్లలో నడిచి వెళ్లేందుకు పట్టేందుకు పట్టే సమయమే అధికం. ఇక నిన్న స్వామివారిని 73,350 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,709 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 2.91 కోట్లుగా నమోదైంది. కాగా, తిరుమలలో రద్దీ లేదని తెలుసుకున్న స్థానిక వ్యాపారులు, తిరుపతి వాసులు, స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

Related posts

స్వంత గూటికి దుబ్బాక టి ఆర్ ఎస్ మున్సిపల్ కౌన్సిలర్స్

Satyam NEWS

ములుగు బస్టాండ్ లో ఆగని చోరీలు: పనిచేయని సీసీ కెమెరాలు

Satyam NEWS

(Professional) Renin Lower Blood Pressure What Can Give You High Cholesterol

Bhavani

Leave a Comment