27.7 C
Hyderabad
May 4, 2024 11: 01 AM
Slider ఆధ్యాత్మికం

జోగుళాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు

#Jogulamba Temple

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగుళాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం జోగులాంబ దేవస్థానం నుండి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,ఈవో పురేందర్ కుమార్, ఆలయ ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ, వేద పండితులు వంకాయల శ్యాం కుమార్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు.

హిందూస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించారు. సంస్థ కార్యవర్గం సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న శక్తిపీఠాలను ప్రదానం చేశారు.

శ్రీ జోగులాంబ ఆలయాన్ని ప్రతిష్టాత్మక “హిందూస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు- 2022” దక్కడం పై తెలంగాణ రాష్ట్రంలోని భక్తులు అంత హర్షం వ్యక్తం చేశారు.

కోవిడ్ పరిస్థితులలో సైతం తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేస్తూ ఏ ఒక్క భక్తుడు కూడా ఆనారోగ్యపరంగా గాని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలకు గాని ఇబ్బంది పడకుండా దేవస్థానం చక్కటి ఏర్పాట్లను నిర్వహించిందని కొనియాడారు.

ఇటీవల జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అనతి కాలంలో ప్రపంచ స్థాయిలో ప్రచారం కల్పించడంతో పాటు, వసతీ గదులు, చక్కటి ఆధ్యాత్మిక వాతవరణం కు కృషి చేశారని నిర్వాహకులు డా. చిన్నస్వామి తో పాటు కర్ణాటక మంత్రి సుధాకర్ కొనియాడారు.

Related posts

సొంత ఖర్చుతో బోరు మోటార్ వేయించిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

సంపద ఏకీకృతం చేసి దోచుకుంటున్న ముఖ్యమంత్రి

Satyam NEWS

Leave a Comment