ఇంకా కాసేపట్లో లాండింగ్ అవుతుందనగా ఇరాన్‌లో ఒక విమానం రన్‌వేపైనుంచి వేగంగా రోడ్డుమీదకు దూసుకువచ్చింది.మహ్‌షహర్ పట్టణంలోని విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.ఆ సమయంలో విమానంలో 135 మంది ప్రయాణీకులున్నారు. విమానం హార్డ్ ల్యాండింగ్ కావడంతో దాని ల్యాండింగ్ గేర్ ఊడిపోవడంతో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులకు పెద్దగా గాయాలు కాలేదు.
విమానం ముందువైపు ఉన్న ద్వారంనుంచి వారంతా ప్రశాంతంగా విమానంలోనుంచి వెలుపలికి వచ్చారు. రోడ్డుపై ఉన్న ప్రజలు, పోలీసులు వారు దిగడానికి సహకరించారు. ప్రయాణీకులందరినీక్షేమంగా వెలుపలికి తీసుకువచ్చామని ప్రొవిన్షియల్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మొహమ్మద్ రెజా రెజానియన్ చెప్పారు.అసలే కష్టాల్లో ఉన్న ఇరాన్ కు ఇది కూడా అమెరికా కుట్రల అనిపించి ఉండవచ్చు