38.2 C
Hyderabad
May 2, 2024 22: 19 PM
Slider ఖమ్మం

గిరిజనులకు అండగా ప్రభుత్వం

#Minister Puvvada Ajay Kumar

పోడు భూముల పట్టాలతో అన్ని ప్రభుత్వ ఫలాల లబ్ది చేకూరుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంత్రి రఘునాథపాలెం రైతు వేదికలో రఘునాథపాలెం మండల పోడు రైతులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో ఏ గ్రామంలో చూసిన ఎకరం 50 లక్షల రూపాయలకు తక్కువ లేదని, ప్రభుత్వం 800 కోట్ల నుండి 1000 కోట్ల రూపాయల విలువ చేసే 1707 ఎకరాల పోడు భూములకు హక్కుదార్లుగా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.

అధికారులు క్షేత్ర పరిశీలన చేసి, గిరిజనులందరికి న్యాయం చేయాలని మంచి మనసుతో చర్యలు తీసుకున్నారని అన్నారు. గ్రామ సభలు కేవలం గిరిజనులా కాదా అనేది చూశారని, అందరు గిరిజనులకు నిష్పక్షపాతంగా పట్టా పాస్ బుక్కులు అందజేశారని ఆయన తెలిపారు.

పట్టా ద్వారా చాలా లాభాలు ఉన్నాయని ఆయన అన్నారు. వారం లోపల ఎకరానికి రెండు సార్లు 5 వేల రూపాయల చొప్పున రూ. 10 వేలు రైతు బంధు, ఒకవేళ దురదృష్టవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల రైతుభీమా, గిరివికాసం పథకం క్రింద సబ్సిడీ బోర్లు, ఉచిత కరంట్, బ్యాంక్ ఋణాలు, ఎరువులు, విత్తనాలు అన్ని ఫలాలు అందుతాయని ఆయన తెలిపారు.

పట్టాలు ధరణి లో పొందుపర్చినట్లు, పిల్లలకు ఇవ్వవచ్చని, పోడు భూముల పట్టాలు ఉన్న వారికి రాజకీయ పదవులు వస్తాయని మంత్రి అన్నారు. ప్రభుత్వం 75 వేల కోట్ల రూపాయలు రైతు బంధు క్రింద రైతుల ఖాతాలకు నేరుగా జమ అయినట్లు, ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయానికి ప్రభుత్వం దన్నుగా నిలిచిందని ఆయన తెలిపారు.

మొక్కజొన్న కు కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఖమ్మం ఖానాపురం హావేలి మెయిన్ రోడ్ లో నిర్మించే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో రఘునాథపాలెం మండల రైతులకు తాము పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. జెడ్పి చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ, పట్టా రైతులకు అందే ప్రయోజనాలన్ని పోడు భూముల రైతులకు అందుతాయని అన్నారు.

గిరిజన తండాలు, గూడెం లను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చి, గిరిజనులకు స్వయం పాలన కల్పించిందని ఆయన తెలిపారు.కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి మాట్లాడుతూ, రఘునాథపాలెం మండలంలో 673 మందికి 1707.12 ఎకరాలకు పోడు భూముల పట్టాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. గత నెల 30 న 195 మందికి పట్టాల పంపిణీ చేయగా, నేడు మిగిలిన 478 మందికి పంపిణీ చేపట్టినట్లు ఆమె అన్నారు.

పోడు భూముల పట్టాలతో రైతుబంధు, రైతుభీమా, గిరివికాసం అన్ని ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని అన్నారు. 16 గిరిజన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అభివృద్ధి నిధుల క్రింద గ్రామ పంచాయతీ భవనాలు మా మంజూరు అయ్యాయన్నారు. పోడు పట్టాల హక్కులతోపాటు, బాధ్యతలు ఉన్నాయని, అడవుల పరిరక్షణ చేయాలని, సమస్యలు వుంటే దృష్టికి తేవాలని అన్నారు.

Related posts

కొల్లాపూర్ లో ఆ బిల్డింగ్ లకు 50లక్షల దాకా పెనాల్టీ

Satyam NEWS

సిఎం జగన్ పై క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి

Satyam NEWS

నేడు ఎలోన్ మస్క్ 51వ పుట్టిన రోజు

Satyam NEWS

Leave a Comment