27.7 C
Hyderabad
May 15, 2024 04: 04 AM
Slider ముఖ్యంశాలు

నిరంతరం అందుబాటులో ప్రజలకు వైద్య సేవలు అందించాలి

#harishrao

నిరంతరం  అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైద్య అధికార సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచ్ సీ కేంద్రంలో డ్యూటీ డాక్టర్ ఎవరు.? ఏలాంటి స్పెషలైజేషన్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ అందరూ ఉన్నారా..? ఎవరెవరూ ఉన్నారని ఒక్కొక్కరుగా ఆరా తీశారు. కేంద్రంలో అన్నీ రకాల మందులు ఉన్నాయా అని అడిగి, మందులు లేవనే మాట రావొద్దని ఫార్మసిస్టుకు సూచించారు.

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫార్మాసిస్టు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. పీహెచ్ సీ పరిధిలోని నిధుల నిల్వ అంశంపై ఆరా తీసి, తిమ్మాపూర్ పీహెచ్ సీ కూడా కరెక్టు లేదని వెంటనే డీఏంహెచ్ఓతో మాట్లాడి హెచ్డీఎస్ నిధులు తెప్పించుకోవాలని పీహెచ్ సీ వైద్య వర్గాలను ఆదేశించారు.

ఏఎన్సీ పర్సంటేజీ ఎంత ఉంది.?, టీబీ శాంపిల్స్ తీసుకుంటున్నారా..? టీబీ రోగులకు డబ్బులు పడుతున్నాయా..లేదో వివరాలు అడిగి తెలుసుకుంటూనే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ ఆరా తీసి, హెచ్డీఎస్ డబ్బులు వాడుకునేలా ఆమోదం ఇవ్వాలని డీఏంహెచ్ఓ కాశీనాథ్ ను ఫోన్ లైనులో ఆదేశించారు.

నార్మల్ డెలివరీలపై దృష్టి సారించాలి

సహజ ప్రసవాలు జరిగేలా చొరవ చూపాలని పీహెచ్ సీ వైద్య సిబ్బందిని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. లేబర్ రూమ్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని అడిగి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. పీహెచ్ సీ వైద్యులు, స్టాఫ్ నర్సు నార్మల్ డెలివరీలు చేయాలని, వాటి ఆవశ్యకత, అవగాహన కల్పించాలని సూచించారు.

పీహెచ్ సీలో వైద్యం అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నప్పుడు.. ఆ రోగికి ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయాలని, నిన్నటి వరకూ అలాంటి కేసులు ఏమైనా వచ్చాయా.. అంటూ ఓపీ-ఔట్ పేషేంట్ రిజిస్టర్ చెక్ చేశారు. మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాజెడీ: మానేరు వంతెనపై నుంచి పడ్డ కానిస్టేబుల్ మృతి

Satyam NEWS

జీవో 1 ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాటం ఆగదు

Satyam NEWS

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64 మంది మృతి

Sub Editor

Leave a Comment