37.2 C
Hyderabad
May 2, 2024 11: 30 AM
Slider వరంగల్

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యురాలిగా అనితారెడ్డి

#anitareddy

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యురాలిగా అనురాగ్  హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్, మాజీ CWC చైర్ పర్సన్ డా.కె.అనితారెడ్డి నియమితులయ్యారు. అదే విధంగా హనుమకొండ, వరంగల్ జిల్లాకు వైస్ చైర్మన్ గా కూడా ఆమె నియమితులయ్యారు.

ఈ సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ పదవికి సరి అయిన న్యాయం చేస్తానని  తెలిపారు. జిల్లాలో వినియోగదారులు ఏ ఇబ్బందులు పడుతున్నా తన సెల్ నెంబర్ 9177362072  కు  తెలియచేయవచ్చని అన్నారు. 

లేదా నేరుగా కలువవచ్చని కూడా ఆమె తెలిపారు. తనను నమ్మి, తన సేవలను గుర్తించి  ఈ పదవి రావడానికి సహకారం అందించిన నేషనల్ వైస్ చైర్మన్ మల్లేశ్వర ప్రసాద్, మిగతా  వారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఇకనుండి వినియోగదారుల చట్టం పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలను చైతన్య పరుస్తూ సేవలను అందిస్తామని  అనితా రెడ్డి తెలిపారు.

Related posts

త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా..

Sub Editor

లాఠీచార్జికి నిరసనగా కూకట్ పల్లి బిజెవైఎం నిరసన

Satyam NEWS

అక్కాచెల్లెళ్లను కొట్టి చంపిన దుండగులు

Bhavani

Leave a Comment