39.2 C
Hyderabad
May 4, 2024 19: 11 PM
Slider ప్రకాశం

సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదు

#Jana Chaitanya

నిర్మాణంలో ఉన్న 106 నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదని ప్రకాశం జిల్లాకు జీవనాడులుగా ఉన్న వెలిగొండ,గుండ్లకమ్మ ప్రాజెక్టులను సత్వరం అభివృద్ధి చేయాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. నేడు ఒంగోలులోని సిపిఐ కార్యాలయ హాలులో వెలిగొండ,గుండ్లకమ్మ ప్రాజెక్టులపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించి ప్రసంగించారు.

ప్రకాశం జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన భూమి 16,50,000 ఎకరాలు ఉండగా సాగునీరు అందుతున్న భూమి 10,50,000 ఎకరాలుకు మాత్రమే అని తెలిపారు. నాగార్జునసాగర్ జవహర్ కాలువ ద్వారా 4,29,747 ఎకరాలు,కృష్ణ పశ్చిమ డెల్టా ద్వారా 77,120 ఎకరాలు, రామతీర్థ రిజర్వాయర్ ద్వారా 72,874 ఎకరాలు,మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన రాళ్లపాడు,మోపాడు,కంభం చెరువు,వీరరాఘవుని ఆనకట్ట,బిట్రగుంట ఆనకట్ల ద్వారా 45727 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని వివరించారు. 3,36,000 ఎకరాలకు ప్రకాశం జిల్లాలో నీరందించగల పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోవటం ప్రకాశం జిల్లా రైతాంగానికి శాపంగా మారిందన్నారు.

కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ 80 వేల ఎకరాలకు నీరు అందించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఆచరణలో గేట్లకు మరమ్మతులు చేయకపోవడం వలన రైతాంగం నిరాశకు గురియ్యారన్నారు.గత 13 నెలలుగా గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడవ గేటును రిపేర్ చేయించలేకపోతుందని, ఆరుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ ముందకు రావటం లేదని 15 గేట్ల మరమతులకు 10 కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

10 లక్షల కోట్లు అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలలో నగదు రూపంలో అందించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో మూడవ వంతు నిర్మాణంలో ఉన్న 106 ప్రాజెక్టులకు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందని,సంపద సృష్టి జరిగి లక్షలాది రైతాంగం, కోట్లాది వ్యవసాయ కూలీల జీవన ప్రమాణ స్థాయి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.

ఇంతకన్నా సంక్షేమ కార్యక్రమం మరొకటి ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ రంగ,నీటిపారుదల నిపుణులు అక్కినేని భవానీ ప్రసాద్ ప్రసంగిస్తూ ప్రకాశం జిల్లాలో బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం వలన వెనుకబడిన జిల్లాగా కొనసాగుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో సాలీనా కురిసే వర్షపాతం లో సుమారు 540 శతకోటి ఘనపు అడుగుల నీరు లభిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ లేకపోవడం శోచనీయమన్నారు.

గోదావరి-కృష్ణ,పెన్నా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే ప్రకాశం జిల్లాకు అవసరమైన నీరు లభిస్తుందన్నారు.పోలవరం రిజర్వాయర్ నుండి సోమశిల రిజర్వాయర్ కు నీటిని తరలించే క్రమంలో నాగార్జునసాగర్ కుడి కాలువ ఫేస్ 2 కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు.ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు ప్రసంగిస్తూ ప్రజలలో చైతన్యం పెరగాలని సమాజ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలన్నారు.

గుండ్లకమ్మ,వెలిగొండ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.సిపిఐ నేత వడ్డే హనుమా రెడ్డి ప్రసంగిస్తూ గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3.8 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం ఉన్నప్పటికీని ప్రాజెక్టు గేట్ల మరమత్తుల కారణంగా 1 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉంటుందని గత 13 నెలలుగా నీరు సముద్రపాలు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా ప్రకాశం జిల్లాలో నీటి వనరులను వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత కామేపల్లి శ్రీనివాసరావు, నరసం గౌరవ అధ్యక్షురాలు టి.

అరుణ,వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మాగులూరి నాగేశ్వరరావు,జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు చిట్టెం వెంకటేశ్వర్లు,సుపరిపాలన వేదిక కార్యదర్శి నాగభూషణం, పౌర సమాజం కన్వీనర్ నర్సింగరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related posts

పోలియో చుక్కలు వేయించడం అందరి బాధ్యత

Satyam NEWS

పెద్ద పాడు గ్రామం లో నూతన ప్రాథమిక పాఠశాలను నిర్మించాలి

Satyam NEWS

జ్యోతిరావు ఫులే ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం

Bhavani

Leave a Comment