27.7 C
Hyderabad
May 16, 2024 06: 15 AM
Slider సంపాదకీయం

మరీ ఇంత అన్యాయమా?: ఆలోచనలో పడ్డ కాపు జాతి

#YS Jagan Mohan Reddy

కాపు కుల ఓట్లకు పెద్ద ఎత్తున గాలం వేద్దామని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వ రాజ్యసభలో చేసిన ప్రకటన పెద్ద అడ్డంకిగా మారుతున్నది. కాపు కులస్తులకు తామే ఛాంపియన్ లుగా చాలా కాలం చెలామణి అయిన ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు గత మూడున్నర సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉండిపోయారు.

కాపులకు రిజర్వేషన్లు అమలు చేయలేకపోయినా, కాపులకు ఆర్ధిక సాయం అందకపోయినా, కాపు కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కకపోయినా కూడా కాపు కులస్తులను ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే నేతలు ఈ మూడున్నర ఏళ్లలో మారు మాట్లాడ లేదు. జన సేన అధినేత పవన్ కల్యాణ్ పై కులం పేరుతో వైసీపీ కాపు కుల నాయకులు అత్యంత దారుణమైన భాషలో దాడి చేసినా కూడా ముద్రగడ పద్మనాభం లాంటి కాపు పెద్దలు అదేమని అడగలేదు.

పవన్ కల్యాణ్ ను కులం పేరుతో దూషించిన సందర్భంలో కూడా వీరు మాట్లాడకపోవడాన్ని అలుసుగా తీసుకుని వైసీపీ నేతలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కాపు కులానికి చెందిన నాయకులు రెడ్డి నాయకులు ఫొటోలు పెట్టుకుని కుల సభలు నిర్వహించినా కూడా కాపు నాయకులు మాట్లాడలేదు సరికదా వైసీపీకి వత్తాసు పలికారు.

తాము ఏం చేసినా కాపు నాయకులు తమతోనే ఉంటారనే ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకు వేస్తూ ఈ నెల 27న విశాఖ పట్నంలో కాపునాడు నిర్వహించేందుకు వైసీపీ కసరత్తు చేస్తున్నది. గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కాపు కులస్తులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటా అసలు అమలు చేసే అవకాశమే లేదని, చంద్రబాబునాయుడు కాపులను మోసం చేశారని ఇంత కాలం వైసీపీ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మిన కాపు కులస్తులు చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీని అనుమానించడం మొదలు పెట్టారు. ఈడబ్ల్యూఎస్ కోటా 10 శాతంలో 5 శాతం కాపు కులంలోని ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేటాయిస్తూ చంద్రబాబునాయుడి ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్నది.

అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎవరి ఇష్ట ప్రకారం వారు విభజించేందుకు వీలులేదని చెబుతు వైసిపి ప్రభుత్వం కాపు రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేవలం విద్యాపరంగా మాత్రమే వర్తించే విధంగా జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ చెప్పినదాని ప్రకారం ఓబిసి రిజర్వేషన్లు లేదా అందులో కోటాలు నిర్ణయించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని, ఆ విషయం రాష్ట్రాల ఇష్టమని స్పష్టం చేశారు.

అంటే గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా చెప్పినట్లు అయింది. ఎన్నికల ప్రచారం సమయంలోనే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పిన వైసీపీ ఆ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అప్పటికే ఉన్న కాపు రిజర్వేషన్లు కూడా రద్దు చేసింది. తమకు జాతికి రిజర్వేషన్లు రద్దు చేసినా మాట్లాడని కాపు కుల పెద్దల పరిస్థితి కూడా కేంద్ర ఇచ్చిన క్లారిటీతో సంకటంలో పడిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తారో లేక భయపడి ఊరుకుంటారో అని కాపు జాతి మొత్తం ఎదురు చూస్తున్నది.

కాపులకు ఇప్పటికి వాస్తవం తెలియడంతో ఇప్పుడు వైసీపీలోని కాపు నాయకులు కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాపు కులస్తులకు అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోని కాపు నాయకులను నిలదీసేందుకు ఇంత కాలం తటస్థంగా ఉన్న కాపు నాయకులు సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ కాపుల మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతాయని ఆ పార్టీ నాయకులే అనుకుంటున్నారు

Related posts

రైతుబంధు మాసపత్రిక వ్యవసాయ రంగ కథల పోటీ

Satyam NEWS

విజయనగరం డిప్యూటీ మేయ‌ర్ ముచ్చు నాగలక్ష్మి కరోనాతో మృతి

Satyam NEWS

యుద్ధప్రాతిపదికన వేములవాడ లో వంద పడకల ఆసుపత్రి

Satyam NEWS

Leave a Comment