26.7 C
Hyderabad
April 27, 2024 10: 46 AM
Slider కరీంనగర్

యుద్ధప్రాతిపదికన వేములవాడ లో వంద పడకల ఆసుపత్రి

#minister KTR

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టి ఈ నెలాఖరులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

తద్వారా జిల్లా ఆసుపత్రి పైన భారం తగ్గుతుందని, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకుగాను అవసరమైన సామగ్రి, సిబ్బందిని సమకూర్చేలా తగిన చర్యలు చేపట్టాలని, ఆక్సిజన్ ట్యాంకు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

ఈ సమీక్షలో జిల్లా పరిషత్ చైర్మెన్ ఎన్.అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా వైద్యాధికారి డా.సుమన్ మోహన్ రావు,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

చర్యలు శూన్యం: తూతూ మంత్రంగా విచారణ

Satyam NEWS

ఉక్కుపాదం:అమరావతి గ్రామాలలో పోలీసు రాజ్యం

Satyam NEWS

బిజెపి యువ నాయకత్వంలో గోవా సమగ్రాభివృద్ధి

Satyam NEWS

Leave a Comment