భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుతో ఆహారం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాపట్ల లోని గడియార స్తంభం సమీపంలో మహాలక్ష్మి చెట్టు వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ నాయకులు బాపట్ల అసెంబ్లీ ఇన్ చార్జి లక్ష్మీ నరసింహం, లేళ్ల తులసి కుమారి, శివన్నారాయణ తదితరులు తెలిపారు. అదే విధంగా గుంటూరు కంకర గుంట గేట్ సెంటర్ లో కూడా జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు అయింది.
previous post