40.2 C
Hyderabad
May 5, 2024 16: 01 PM
Slider నల్గొండ

కరోన బాధిత జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

#Journalists

కరోనా బాధిత జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో  మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే ఐజేయూ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గాంధీ విగ్రహానికి   పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం  TUWJ IJU నాయకులు  మాట్లాడుతూ నేటికీ రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మరణించారని,1100 వందల మంది మీడియా సిబ్బంది కి,వారి కుటుంబాలకు కరోనా సోకిందని అన్నారు.

ఈనాటికీ జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి  సహాయాన్ని అందించకపోవడం విచారకరమని, కరోనా బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి సాయం అందించాలని, కరోనా వైరస్ సోకిన జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యశాలలలో ప్రత్యేక వైద్య సదుపాయాలు అందించాలని కోరారు.

కోవిడ్ వారియర్స్ గా నిలిచిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలు భీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU జిల్లా జర్నలిస్టు నాయకలు, స్థానిక జర్నలిస్టులు పాల్గొనగా వారి నిరసనకు మద్దతుగా  సిపిఐ కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సంఘీభావాన్ని తెలిపారు.

Related posts

నో స్లీప్:విక్రమ్ ల్యాండర్ విఫలం తో ప్రశాంతత కోల్పోయా

Satyam NEWS

పెరిగిన ఆర్టీసీ చార్జీలకు వామపక్షాలు నిరసన…

Satyam NEWS

క్యాన్సర్, కోవిడ్ తో ఏక కాలంలో పోరాడి గెలిచిన మహిళ

Satyam NEWS

Leave a Comment