28.7 C
Hyderabad
May 5, 2024 07: 55 AM
Slider నిజామాబాద్

జుక్క‌ల్‌లో రైతు వ్య‌తిరేక బిల్లుల‌పై నిర‌స‌న‌

jukkal

జుక్కల్ నియోజకవర్గంలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా, రైతు వ్య‌తిరేక బిల్లుల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని, కొత్త వ్యవసాయ చట్టాన్నివ్యతిరేకిస్తూ రైతు సంఘాలు మంగళవారం దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ నియోజకవర్గంలో విజయవంతమైంది. నియోజకవర్గంలోని జూకల్, బిచ్కుంద, మద్నూర్, పెద్దకొడప్గల్, నిజాంసాగర్, పిట్లం మండలాలో ఉదయం నుండే వ్యాపారస్తులు వర్తకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అనంతరం ఆయా మండలాల్లో తెరాస శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారి 161పైన జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఈ బంద్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరిచే ఈ చట్టాన్నివెంటనే ఉపసంహరించాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతు బీమా, రైతులకు పెట్టుబడిసాయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అందిస్తుందన్న విషయాన్నిగుర్తుచేశారు. అనంతరం మద్నూర్ జుక్కల్ మండలాలలో కొనసాగుతున్నబంద్ లో ఎమ్మెల్యే షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ ప్రాంతాన్నిసందర్శించారు. జుక్కల్ మండలంలోని జూకల్ చౌరస్తాలో మాజీ శాసనసభ్యులు గంగారాం జాతీయ రహదారి 161 తమ పార్టీ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించారు.

నిజాంసాగర్ మండలంలో మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు వంటవార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం క౦దరుపల్లి లో రోడ్డుపైనే ఎమ్మెల్యే షిండే బైఠాయించి భోజనాలు చేశారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తెరాస పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

సోమును తీసేయకపోతే బీజేపీ బతకడం కష్టం

Satyam NEWS

విక్టరీ‌ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్‌తో ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ‘క్రాక్‌’

Satyam NEWS

Over|The|Counter _ Can A Doctor Immediately Cure Hypertension Greater Drug Than Hydrochlorothiazide For The Treatment Of Hypertension

Bhavani

Leave a Comment