37.2 C
Hyderabad
May 6, 2024 21: 53 PM
Slider కడప

రాజంపేట లో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

#Junior NTR

అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.నేషనల్ హైవే లోని భారీ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభి షేకం చేసి పూలమాల వేసి నినాదాలు చేశారు.రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

సమద్ థియేటర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి,40 కేజీల కేక్ కటింగ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.తీన్మార్ డాన్స్ లతో ఫ్యాన్స్ సందడి సృష్టించారు. ఈ సందర్భంగా సింహాద్రి స్పెషల్ షాని ఫ్యాన్స్ తిలకించారు.ఈ కార్యక్రమాలకు గండ్ర శ్రీహరి నాయుడు,వక్కంటి సుకుమార్ చౌదరి, దుగ్గినేని చంద్ర బాబు నాయుడు (సింగపూర్), ఎన్టీఆర్ కేశవ,

వాసుదేవ రాజు,తేజ్ రెడ్డి,మధు సూధన నాయుడు,లక్ష్మీ కర్, గంగా దర్,కిషోర్, బాద్షా, సుబ్రహ్మణ్యంరెడ్డి, శ్రీను,రెడ్డయ్య తదితరులు ఆధ్వర్యం వహించారు. ముఖ్య అతిధులులు గా టీడీపీ నేతలు సన్నప నేని బాపణయ్య నాయుడు, డి.ఆర్.యల్. మణి,నాగినేని దివాకర్ నాయుడు,మేడికొండ వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హిందీ ఓకే… ఇంగ్లీష్ వద్దంటే ఎలా?

Satyam NEWS

హంటింగ్ కంటిన్యూస్: టిడిపి నాయకుడికి నోటీసులు

Satyam NEWS

మెదక్ పోలీసుల వలలో చిక్కిన ఇద్దరు చైన్ స్నాచర్ లు

Satyam NEWS

Leave a Comment