28.7 C
Hyderabad
April 27, 2024 06: 49 AM
Slider మెదక్

మెదక్ పోలీసుల వలలో చిక్కిన ఇద్దరు చైన్ స్నాచర్ లు

#medakpolice

ఇద్దరు చైన్ స్నాచర్ లను మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రామాయంపేట ఎస్బిఐ బ్యాంకు ముందర నిలబడి ఉన్న సుతారిపల్లికి చెందిన రాజమణి మెడలో నుండి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి పుస్తెలతాడు తెంపుకొని నిన్న పారిపోయారు. కేసు నమోదు చేసి తూప్రాన్ డి‌ఎస్‌పి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు ప్రారంభించారు. రామాయంపేట పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తులు రామాయంపేట నుండి నిజాంపేట వైపు పారిపోతున్నారని పోలీసులు గమనించారు.

సాయంత్రం సమయంలో కోనాపూర్ గ్రామంలో నుండి నిజాంపేట వైపు మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు అనుమానిత వ్యక్తులు రామాయంపేటలో చైన్ స్నాచింగ్ చేసిన వ్యక్తుల లాగానే కనిపించగా, వెంటనే రామయంపేట్ ఎస్ఐ సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోతుంటే, వారిని మోటార్ సైకిల్ తో పాటుగా పట్టుకున్నారు. వారిని ఆ తర్వాత రామయంపేట్ సిఐ ఆఫీస్ కి తీసుకొని రావడం జరిగింది.

ఆ తర్వాత విచారణ చేయగా వీరిద్దరు కూడా రామయంపేట్ ఎస్బిఐ బ్యాంకు ముందర రాజమణి మెడలో నుండి చైన్ స్నాచింగ్ చేసిన నేరాన్ని ఒప్పుకోన్నారు. ఆ తర్వాత వారి నుండి మూడు తులాల బంగారు పుస్తెలతాడును, ఒక బండిని, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఆ తదుపరి విచారణలో భాగంగా నేరస్తుడైన కుర్నాపల్లి రంజిత్ కుమార్ పోతారెడ్డిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి అని, ఇతను ఇది వరకే దుబ్బాక మరియు భూంపల్లి పోలీస్ స్టేషన్ల నుండి 8 దొంగతనం కేసులలో జైలుకుపోయి వచ్చినాడని, అంతేగాక మరొక నేరస్తుడైన దొమ్మాట సుధాకర్ దుంపలపల్లి గ్రామస్తుడని, ఇతను రెండు రేప్ కేసులలో జైలుకు పోయి వచ్చినట్టుగా తెలిపారు. ఈ కేసు జరిగిన నాలుగు గంటల లోపలనే నేరస్థులను పట్టుకున్న డి‌ఎస్‌పి తూప్రాన్, రామయంపేట సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.

Related posts

2016 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి

Satyam NEWS

‘డై హార్డ్ ఫ్యాన్ మోష‌న్ పోస్ట‌ర్ కి అనూహ్య స్పంద‌న‌

Satyam NEWS

వితంతువులు మనోధైర్యంతో ముందుకు సాగాలి

Satyam NEWS

Leave a Comment