చౌనివీధి మసీదు ఇమామ్ ఆయుబ్ ఖాన్, అప్టికల్ ఫయాజ్ ల తండ్రి సయ్యద్ ఖాన్ ఇటీవల హార్ట్ స్టోక్ తో మృతి చెందారు. వారి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సన్నీ తండ్రి చాకలి బాలయ్య మృతి చెందడంతో వారి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి జూపల్లితో పాటు అనుచర వర్గం మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ ఎక్బాల్, నయిమ్, రెడ్డి సత్యం, అన్వర్, బోరెల్లి మహేష్, కె.ధర్మ తేజ, పసుల వెంకటేష్, జి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.