29.7 C
Hyderabad
May 1, 2024 09: 18 AM
Slider పశ్చిమగోదావరి

కమ్యూనిటీ స్థలానికి ఎసరు పెట్టిన లైన్ మెన్

#housesite

ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో సర్వే నంబర్6/3.4 లోపంచాయతీ (సి పి) కమ్యునల్ పర్పస్ భూమి లో నిబంధనలకు విరుద్ధంగా సచివాలయ జూనియర్ లైన్ మెన్  తన బంధువు పేర పొందిన నివాస స్థల పట్టా తెచ్చుకోవడం కాలనిలో ఉద్రిక్తతలకు దారి తీసింది.

వాస్తవానికి ఈ జూనియర్ లైన్ మెన్ పట్టా పొందడానికి అనర్హుడైనా గ్రామ మాజీ సర్పంచ్ ఒకరు అందరితో పాటు ఇతని బంధువు పేర వేరే చోట పట్టా ఇచ్చారు. దానిని కాదని 30 ఏళ్లుగా కాలనీ వాసులు కాలనీ అవసరాలకు ఉపయోగించుకుంటున్న పంచాయతీ సి పి స్థలం 5 సెంట్లు పై కన్నేశాడు.

ఇంకేముంది గ్రామంలో ఒక ఛోటా నాయకుడిని అడ్డుపెట్టుకుని అప్పటి వి ఆ ర్ ఓ కి రూ.50,000 ముట్ట జెప్పి  పంచాయతీ సి పి స్థలంలో అక్రమ పట్టా పొందాడని పంచాయతీలో కొంత మంది ఆరోపిస్తున్నారు. ఈ పట్టాను అడ్డు పెట్టుకుని జూనియర్ లైన్ మెన్ పంచాయతీ సి పి స్థలం మెరక చేసాడు.

దీనిపై కాలనీ వాసులు అప్పట్లో జిల్లా కలెక్టర్ కి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.  జూనియర్ లైన్ మెన్ కి నిబంధనలకు విరుద్ధం గా పంచాయతీ సి పి స్థలంలో అక్రమంగా పొందిన పట్టాను రద్దు చేసి స్టలాన్ని రక్షించాలని కోరారు. స్పందనలో తనపై ఫిర్యాదు చేసిన కాలనీ వాసుల పై తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి

సెంట్రల్ జైలుకు పంపుతానని కొంతమంది ని బెదిరించాడని అప్పట్లో చెప్పుకున్నారు. ఆదివారం ఉదయం కాలనిలో ఒక వ్యక్తి తన కుమారుడి వివాహ రిసెప్షన్ కోసమని ఆ స్థలాన్ని జె సి బి తో బాగుచేస్తుండగా జూనియర్ లైన్ మెన్ తన అనుచరులతో వచ్చి ఇది తన పట్టా భూమి అని అడ్డుకున్నాడు. రెవిన్యూ, పంచాయతీ అధికారులు తమ కు పట్టా ఇచ్చినందున ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదని వివాహ రిసెప్షన్ పనులను అడ్డుకున్నాడు.

ఒక దశలో గ్రామస్తులకు జూనియర్ లైన్ మెన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతి భద్రతలు అదుపు తప్పుతాయా అనే ఉత్కంఠత కాలనివాసుల్లో నెలకొంది. ఈ ఘటనపై కాలనీ వాసులు పెదవేగి తహసీల్దార్ కి తెలియ పర్చారు. ఆ స్థలం లో జూనియర్ లైన్ మెన్ కి ఇచ్చిన పట్టా రద్దుచేస్తామని తహసీల్దార్ నాగరాజు గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Related posts

శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

Satyam NEWS

చేప ప్రసాదం పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి

Bhavani

వ్యాపారవేత్త జ్యోతికి కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవి

Satyam NEWS

Leave a Comment